Breaking News

బర్గర్ చెప్పించిన భయంకరమైన నిజం.. అక్కాచెల్లెళ్లే హంతకులు.. కానీ పాపం.!


ఉదయం నుంచి చూస్తున్నా ఆ ఇంట్లో టీచర్ బయటికి రాలేదు. ఎవ్వరూ బయట కనిపించడం లేదేంటని ఇరుగుపొరుగుకు అనుమానం వచ్చింది. ఆమె ఇంటికెళ్లి తలుపు కొట్టినా ఎవరూ తలుపు తీయలేదు. కిటికీ తలుపులు కూడా మూసి ఉన్నాయి. ఏం జరిగిందో అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత టీచర్ కూతురు ఒకరు బయటికొచ్చి అమ్మ చనిపోయిందని చెప్పింది. కంగుతిన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్పాట్‌కి చేరుకుని ఇంట్లోకి వచ్చి అక్కడి సీన్ చూసి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. మంచంపై రక్తపు మడుగులో టీచర్.. ఆ పక్కనే ఆమె ఇద్దరు కూతుళ్లు బొమ్మలతో ఆడుకుంటూ కనిపించడంతో అవాక్కయ్యారు. తల్లి శవం పక్కన ఆడుకోవడమేంటని ఆశ్చర్యపోయారు. మతిస్థిమితం లేని ఆమె ఇద్దరు కూతుళ్లు ఏం చేశారు.? బర్గర్ బయటపెట్టిన రహస్యమేంటి? తమిళనాడులో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు.. తిరునల్వేలి జిల్లా పళయంకొట్టైకి చెందిన ఉష తన ఇద్దరు కూతుళ్లతో కలసి కేటీసీ నగర్‌లో నివాసముంటోంది. భర్త కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోవడంతో ఉష స్టూడెంట్స్‌కి ట్యూషన్స్ చెప్పుకుంటూ బిడ్డలను పోషించుకుంటోంది. అనూహ్యంగా ఆమె దారుణ హత్యకు గురైంది. ఉదయం నుంచి టీచర్ కనీసం బయటికి కూడా రాకపోవడంతో ఇరుగుపొరుగుకి అనుమానం వచ్చింది. ఆమె ఇంటికి వెళ్లి తలుపు తట్టినా ఎవరూ తీయలేదు. ఇంటి కిటికీలు కూడా బిగించి ఉండడంతో ఏం జరిగిందో అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు కూతుళ్లలో ఒకరు బయటికి వచ్చి తల్లి చనిపోయిందని చెప్పడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అకస్మాత్తుగా ఆమె చనిపోవడమేంటని అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు నెల్లాయ్ పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కి వచ్చిన పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూసి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. బెడ్‌పై రక్తపు మడుగులో టీచర్ పడి ఉంటే.. ఆ పక్కనే ఆమె ఇద్దరు కూతుళ్లు బొమ్మలతో ఆడుకుంటూ కనిపించడంతో కంగుతిన్నారు. ఆమె ఎలా చనిపోయిందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఉష ఇద్దరు కూతుళ్లకి మతిస్థిమితం లేకపోవడంతో ఆమె హత్య పోలీసులకి మిస్టరీగా మారింది. ఆమెను ఎవరు చంపారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మతిస్థిమితం లేని కూతుళ్లని ప్రశ్నించినా లాభం లేకపోయింది. ఇద్దరూ తమకు తెలియదన్నట్టు ప్రవర్తించడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. కూతుళ్ల దగ్గరే సమాచారం ఉందని భావించిన పోలీసులు తెలివిగా వ్యవహరించి కేసును ఛేదించారు. ఉష ఇద్దరు కూతుళ్లను స్మార్ట్‌గా డీల్ చేశారు పోలీసులు. ఇద్దరినీ కూల్‌గా దగ్గరికి తీసుకుని అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఏం జరిగిందో చెబితే బర్గర్లు ఇప్పిస్తామని చెప్పడంతో భయంకరమైన నిజం వెలుగుచూసింది. బర్గర్‌కి ఆశపడిన అక్కాచెల్లెళ్లు తల్లిని తామే చంపేశామని అసలు విషయం కక్కేశారు. కర్రతో కొట్టి హత్య చేసినట్లు ఒప్పేసుకున్నారు. అయితే ఇద్దరూ దివ్యాంగులు కావడంతో ఆమెను ఎందుకు చంపాల్సి వచ్చిందనే కారణం మాత్రం తెలియలేదు. చంపింది కూతుళ్లే అని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి పోలీసులది. మానసికంగా సరిగ్గా లేని కూతుళ్లు కంటికి రెప్పలా కాపాడుతున్న కన్నతల్లిని ఎందుకు చంపుకున్నారో తెలీని దైన్యం వారిది. పాపం.. వాళ్లెందుకు చేశారో ఈ ఘోరం!! అనుకోవడం మినహా కారణాలు అంతుచిక్కని అసాధారణ కేసుగా మిగిలిపోయింది. కూతుళ్లకి మానసిక వైద్యుడితో చికిత్స చేయించిన అనంతరం స్టేట్‌మెంట్ రికార్డు చేస్తామని పోలీసు అధికారి తెలిపారు. Also Read: Read Also:


By July 23, 2021 at 12:11AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tamil-nadu-mentally-unsound-daughters-play-with-dolls-next-to-mothers-corpse/articleshow/84657844.cms

No comments