Breaking News

నీకు మ్యాటర్ లేదన్న మరదలు.. రెచ్చిపోయిన బావ, వారణాసిలో దారుణం


ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. వార‌ణాసిలోని మ‌హ‌మూర్‌గంజ్ ప్రాంతంలో బుధ‌వారం ఉద‌యం ఓ మహిళా డాక్టరును ఆమె బావ అత్యంత కిరాతకంగా హ‌త్య చేశాడు. మృతురాలిని ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణుడు, మాజీ ఎమ్మెల్యే రజనీకాంత్ దత్తా కోడలు డాక్టర్ స్వప్నగా పోలీసులు గుర్తింంచారు. కుటుంబ కలహాల నేపథ్యంలో సప్నను ఆమె బావ అనిల్ ద‌త్తా చంపేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అతడు నేరాన్ని అంగీకరించాడు. అంతకుముందే అతడు ఓ వీడియో క్లిప్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ‘అనారోగ్యంతో ఉన్న నా తల్లిదండ్రులను చూసేందుకు వెళ్తుండగా స్వప్న నన్ను నపుంసుకుడివంటూ నిందించింది. గతంలో నాతో పాటు నా తమ్ముడిని ఇలాగే నిందించింది. అందుకే తట్టుకోలేక చంపేశా’ అని అనిల్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. తన వదిన అలా నిందించేసరికి తట్టుకోలేక పదునైన ఆయుధాలతో దాడి చేశానని, తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయిందని అనిల్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలోని సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు.


By July 22, 2021 at 09:25AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/lady-doctor-murered-by-brother-in-law-in-varanasi/articleshow/84627489.cms

No comments