Breaking News

క్రిమినల్స్ తప్పించుకుంటే కాల్పులు తప్పులేదు.. సీఎం సంచలన ఆదేశాలు!


కస్టడీ నుంచి తప్పించుకోడానికి ప్రయత్నించే నేరస్థులపై కాల్పులు జరపడం ఓ మోడల్‌గా ఉండాలని అసోం ముఖ్యమంత్రి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అసోంలో జరుగుతున్న వరుస ఎన్‌కౌంటర్లను సీఎం సమర్దించారు. మహిళలపై జరిగే నేరాలను పూర్తిగా అరికట్టి, చార్జిషీట్ సహా ఇతర విషయాలలో ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లలోని అధికారులతో తొలిసారి జరిగిన సమావేశంలో ఈ మేరకు సీఎం బిశ్వ శర్మ పలు సూచనలు చేశారు. అసోంలో పోలీసుల ప్రమాణాలు మెరుగుపడాలని సీఎం పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు సహా వివిధ నేరాలకు సంబంధించిన కేసుల్లో వీలైనంత త్వరగా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. ఈ సందర్బంగా క్రిమినల్స్ కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎన్‌కౌంటర్ చేసి పడేయాలని సూచించారు. ‘‘ఒకే వేళ ఎవరైనా నిందితుడు సర్వీస్ రివాల్వర్ లాక్కుని పారిపోయినా, తప్పించుకోనే ప్రయత్నం చేసినా ఉపేక్షించవద్దు.. రేపిస్ట్‌ల విషయంలో కాలుపై కాల్పులకు చట్టం అనుమతిస్తుంది.. కానీ, ఛాతీపై కాల్చడం కుదరదు’’ అని సీఎం చెప్పారు. ‘రాష్ట్రంలో కాల్పుల సంఘటనలు ఒక మోడల్‌గా మారుతున్నాయా అని ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే.. కస్టడీ నుంచి నేరస్థుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే కాల్పులు జరపడం తప్పులేదని నేను సమాధానం ఇస్తాను’ అన్నారు. సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ మాట మార్చడం గమనార్హం. కాల్పులు జరిపే అధికారం పోలీసులకు లేదు.. ప్రజాస్వామ్యంలో చట్టం ద్వారా నేరాలపై పోరాడాలన్నారు. అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో ఇటువంటి కాల్పులు జరపొచ్చని అన్నారు.


By July 06, 2021 at 09:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/assam-chief-minister-suggest-to-police-to-shoot-down-escaping-criminals-must-be-pattern/articleshow/84162534.cms

No comments