Breaking News

హాట్ హాట్‌గా రెచ్చిపోయిన మంచు లక్ష్మి.. గత రాత్రి అంటూ! అక్కను తక్కువ అంచనా వేశాం కానీ!!


మోహన్ బాబు కూతురిగా, నటిగా మంచు లక్ష్మికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మాట్లాడే మాటల్లో, చేసే చేష్టల్లో ప్రత్యేకత చూపే ఆమె అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై ఫాలోయింగ్ సంపాదించింది. సినిమాల్లో భాగమవుతూనే పలు కార్యక్రమాలకు హోస్ట్‌గా చేసి ఆకట్టుకుంది. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఆన్‌లైన్ వేదికలపై కూడా తన మార్క్ చూపెడుతూ తెగ హంగామా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ హాట్ పిక్ నెట్టింట రచ్చ చేస్తోంది. ఆమెనలా చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చేసే పోస్టులు, ఇచ్చే కొటేషన్స్ లోనూ వైవిద్యం చూపెడుతుండటం గమనార్హం. తన ఫ్యామీలీ ఫొటోలతో పాటు ప్రత్యేకంగా తన కూతురు విద్యా నిర్వాణ ఫొటోస్, ఆమెకు సంబంధించిన అన్ని విషయాలు షేర్ చేస్తూ టచ్‌లో ఉంటోంది. అయితే ఆమె చేస్తున్న ట్వీట్స్‌పై నెటిజన్స్ ట్రోల్స్‌కి దిగడం సాధారణమైన పరిణామంగా మారింది. రీసెంట్‌గా వాక్సిన్ తీసుకున్నా అని చెప్పి అడ్డంగా బుక్కై ట్రోల్స్ బారిన పడింది అయినప్పటికీ అవేవీ పెద్దగా లెక్కచేయని మంచు వారమ్మాయి.. సోషల్ మీడియాలో తన హవాను ఏ మాత్రం తగ్గించడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా మరో ఫొటో పోస్ట్ చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. విదేశాల్లో ఉండి వచ్చిన మంచు లక్ష్మి అక్కడి కల్చర్‌ను ఎక్కువగా ఫాలో అవుతుంటుంది. కానీ, దుస్తుల విషయంలో బయట ఎక్కువగా అలా కనిపించని ఆమె.. తొలిసారి కురచ దుస్తుల్లో యమ హాట్ లుక్‌లో కనిపించింది. పైగా ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ 'గత రాత్రి గురించి' అంటూ మరింత హాట్ కామెంట్ వదిలింది. రెస్టారెంట్ వెళ్లి తిరిగి వస్తుండగా ఓ స్నేహితుడు కొన్ని ఫొటోస్ అడిగాడు. దాని ఫలితమే ఇది అని మంచు లక్ష్మి పేర్కొంది. ఇక ఆమెనిలా చూసిన నెటిజన్స్ రెచ్చిపోతూ కామెంట్స్ చేస్తున్నారు. ''వావ్.. బ్యూటిఫుల్, ఇలాంటి మరిన్ని ఫొటోలు పెట్టండి మేడమ్'' అని కొందరు అంటుండగా, మరికొందరు 'స్నో అక్కను తక్కువ అంచనా వేశాం కానీ' అంటూ కాస్త పదునైన కామెంట్స్ వదులుతున్నారు. అలా మంచు లక్ష్మి పోస్ట్ చేసిన కొద్ది సేపట్లోనే ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


By July 09, 2021 at 08:48AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/manchu-lakshmi-shared-her-hot-photo-from-travel-diaries/articleshow/84256870.cms

No comments