Breaking News

శ్యామ్ సింగరాయ్ షూటింగ్‌ పూర్తి.. ఇక అదే తరువాయి అంటూ నాని ట్వీట్


నేచురల్ స్టార్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. వరుసగా రెండు మూడు ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టేశారు. ఇప్పటికే టక్ జగదీశ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు సినిమాను వాయిదా వేశారు. దీంతో పాటు నాని నటిస్తున్న మరో రెండు సినిమాలు ‘’, ‘అంటే సుందరానికి’. గత ఏడాది ప్రారంభమైన ‘శ్యామ్ సింగరాయ్’ షూటింగ్ ఆ మధ్య కరోనా కారణంగా వాయిదాపడింది. ఆ తర్వాత పరిస్థితులు మామూలు అయ్యాక షూటింగ్‌ని ప్రారంభించారు. మహమ్మారి కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లోనూ తగిన జాగ్రత్తల నడుమ షూటింగ్‌ని జరిపారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని నాని స్వయంగా ట్వీట్ చేశారు. ‘షూటింగ్ పూర్తయింది. ఒక మంచి టీమ్ ఉన్నప్పుడు ఫలితం కూడా అంతే మంచిగా వస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి’ అంటూ నాని పేర్కొన్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాలో , కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా (ఎ ఫిల్మ్ బై అరవింద్ ఫేమ్) కథను అందిస్తున్నారు. నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో జిషు సేన్ గుప్తా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కోల్‌కతా‌లో జరిగే కథ కావడంతో హైదరాబాద్‌లోనే భారీ వ్యయంతో కోల్‌కతా సెట్‌ను రూపొందించి అందులోనే షూటింగ్ జరిపించారు. అన్ని జాగ్రత్తల మధ్య నిర్మించిన సెట్‌లో షూటింగ్ జరగడంతో.. నటీనటులు కూడా ఎలాంటి భయం లేకుండా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఇక నాని ‘అంటే సుందరానికి’ సినిమాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. వివేక్ ఆత్రేయ కాంబోలో రాబోతోన్న అంటే సుందరానికీ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.


By July 26, 2021 at 11:23AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nani-movie-shyam-singha-roy-shooting-completes/articleshow/84750396.cms

No comments