Breaking News

ప్రతీ ఒక్కటీ ఎంజాయ్ చేశాను.. సింగర్ సునీత మెచ్చిన చిత్రం


పాటలు పాడటమే కాకుండా హీరోయిన్లకు గొంతు అరువు ఇవ్వడంలోనూ తనకు తానే సాటి. సౌందర్య దగ్గరి నుంచి నేటి హీరోయిన్లలో ఎంతో మందికి సునీత డబ్బింగ్ చెప్పారు. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ సునీతకు మంచి గుర్తింపు ఉంది. అలా సునీత ఇప్పుడు తాజాగా ఓ సినిమా మీద మనసు పడ్డారు. తనకు నచ్చిన చిత్రమిదని చెబుతూ..పాటలు, మాటలు ప్రతీ ఒక్క విషయంలో ఎంతో నచ్చిందని సునీత పేర్కొన్నారు. ఇంతకీ ఆసినిమా ఏంటో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. తమిళంలో త్రిష కెరీర్‌ను మలుపుతిప్పిన 96 చిత్రం. విజయ్ సేతుపతి అసాధారణ నటన చిత్రాన్ని క్లాసిక్‌గా మార్చేసింది. ఇక పాటలు అయితే తమిళనాడునే కాదు మొత్తం దక్షిణాదిని ఊపేసింది. అలా 96 సినిమా ఓ మ్యాజిక్ క్రియేట్ చేసింది. దాన్నే తెలుగులో జాను అని సమంత, శర్వానంద్‌లతో తీశారు. కానీ ఫలితం ఆశించినంతగా రాలేదు. ఇప్పుడు 96 సినిమాను తెలుగులో డబ్ చేసి వదిలారు. తెలుగు డబ్బింగ్ సినిమాలో త్రిష పాత్రకు సునీతనే గొంతు ఇచ్చారట. ఈ విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చారు. తమిళంలో 96 సినిమా విడుదలైనప్పుడే నాకు ఎంతో నచ్చింది. త్రిషకు తెలుగులో డబ్బింగ్ చెప్పడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ప్రతీ డైలాగ్, ప్రతీ పాటను ఎంతో ఎంజాయ్ చేశాను అని చెప్పుకొచ్చారు. మొత్తానికి 96 క్రియేట్ చేసిన మ్యాజిక్ మాత్రం అందరికీ గుర్తుండిపోయింది.


By July 12, 2021 at 08:37AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/singer-sunitha-about-trisha-and-vijay-sethupathi-96-movie/articleshow/84334673.cms

No comments