నేడు భూమిని తాకనున్న సౌర తుఫాను.. జీపీఎస్, మొబైల్ సిగ్నల్స్ వ్యవస్థ చిన్నాభిన్నం!
శక్తిమంతమైన భూమివైపు వేగంగా దూసుకొస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది. దాని ప్రభావంతో సెల్‌ఫోన్ సిగ్నళ్లు, జీపీఎస్ వంటి సేవలకు అంతరాయం కలిగే అవకాశముందని నాసా పేర్కొంది.. సూర్యుడి వాతావరణంలో ఉద్భవించిన ఈ తుఫాను గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి దిశగా దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దాని వేగం మరింత పెరిగే అవకాశముందని, సోమవారం లోపు ఎప్పుడైనా భూ గ్రహాన్ని తాకొచ్చని హెచ్చరించారు. సౌర తుఫాను కారణంగా ఉత్తర/ దక్షిణ ధ్రువ ప్రాంతాల్లోని ప్రజలు అందమైన ఖగోళ కాంతిని చూడగలరని తెలిపారు. సౌర తుఫాను ప్రభావంతో భూగోళపు బాహ్య వాతావరణం వేడెక్కే అవకాశముందని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ ప్రభావం ఉపగ్రహాలపై పడి.. జీపీఎస్ నేవిగేషన్, మొబైల్ ఫోన్ సిగ్నళ్లు, శాటిలైట్ టీవీ వంటి సేవల్లో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్తు తీగల్లో ప్రవాహ తీవ్రత పెరిగి ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయే ముప్పుందనీ హెచ్చరించారు. ఈ భూ అయస్కాంత తుఫాను శక్తివంతమైన గాలులను ప్రేరేపించే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రాథమికంగా సౌర తుఫాన్లు భూ వాతావరణంలోకి ప్రవేశించే గాలుల శక్తిని సమర్థవంతంగా మార్పిడి చేయడం వల్ల భూమి అయస్కాంత గోళంలో సంభవించే పెద్ద లేదా చిన్న ఆటంకాలను సూచిస్తాయి. నాసా అంచనా ప్రకారం.. సౌర గాలులు గంటకు ఒక మిలియన్ మైళ్ల వేగంతో వీస్తాయని తెలిసింది. ప్రస్తుతం గాలులు భూమి వైపు గంటకు 1.6 మిలియన్ కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. నేషనల్ వెదర్ సర్వీసెస్‌కు చెందిన స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ జూన్‌లో జీ -1 క్లాస్ సౌర తుఫాను గురించి ముందే అంచనా వేసింది. కాగా, గతేడాది నవంబర్ 29న సూర్యుడి ఉపరితలంపై భారీ తుఫాను సంభవించినట్టు ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దగా... మంటలు ఎగసిపడ్డి.. అంతరిక్షంలోకి సెగలు కక్కుతూ దూసుకెళ్లాయి. అంతటి అత్యంత వేడి, అతిపెద్ద సౌర తుఫాను గత మూడేళ్లల్లో ఎప్పుడూ సూర్యుడిపై రాలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యుడిపై ఇలాంటి పేలుళ్లు సంభవించినప్పుడు అంతరిక్షంలోకి క్షణాల్లో సౌర గాలులు దూసుకెళ్తాయి. ఈ చర్యనే కరొనల్ మాస్ ఇజెక్షన్ (coronal mass ejection) అంటారు.
By July 12, 2021 at 09:00AM
No comments