రాహుల్, ప్రియాంకతో.. ప్రశాంత్ కిషోర్ కీలక భేటీ..
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కీలక నేతలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. అదే సమయంలో పంజాబ్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ హరీష్ రావత్, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి. వేణుగోపాల్‌లు కూడా రాహుల్ నివాసానికి చేరుకున్నారు. రాహుల్, ప్రియాంకలతో పలు రాజకీయ సమస్యలపై చర్చలు జరిపారని, అయితే ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి సంబంధించి మాత్రం కాదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం కాంగ్రెస్ హైకమాండ్ పంజాబ్ రాష్ట్ర యూనిట్‌లో చేస్తున్న పలు మార్పులపై జరిగి ఉండవచ్చన్న వార్తలు వస్తున్నాయి. బిజెపికి చెక్ పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు జరుగుతున్న సమావేశాల్లో భాగంగానే ప్రశాంత్ కిషోర్ రాహుల్‌తో భేటీ అయ్యారన్న ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో.. గత నెలలో ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్‌తో ప్రశాంత్‌కిషోర్ పలుమార్లు సమావేశమైన సంగతి తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ పంజాబ్ సిఎం అమరీందర్‌సింగ్‌కు ప్రధాన సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు.
By July 14, 2021 at 11:29AM
No comments