డేట్‌కి వెళ్లిన రామ్ చరణ్- ఉపాసన.. హోటల్‌లో మెగా దంపతులు అలా! నెటిజన్స్ క్రేజీ రియాక్షన్స్
ఫ్యామిలీతో సరదాగా గడపడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు నేటితరం యంగ్ హీరోలు. ఏ మాత్రం విరామం దొరికినా ఫ్యామిలీ టూర్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా లాక్ డౌన్ కారణంగా విరామం దొరికినా కోవిడ్ ఉదృతి ఉండటంతో ఇంటికే పరిమితమైన దంపతులు.. ఇప్పుడు సరదాగా డేట్‌కి వెళ్లారు. వీకెండ్ కాకపోయినా 'మిడ్ వీక్' అంటూ బుధవారం రోజు ఓ రెస్టారెంట్ వెళ్లి లంచ్ చేశారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. హబ్బీ మిస్టర్- సితో డేట్‌కి వెళ్ళడానికి ఎంతో ఇష్టపడే ఉపాసన.. చెర్రీ పక్కనుంటే బోలెడంత హంగామా చేస్తుంటుంది. సన్నిహితుల బర్త్ డేలు, పెళ్లి రోజులు, వీకెండ్స్ అంటూ ఏ ఒక్క పార్టీ మిస్ కాకుండా ఎంజాయ్ చేస్తుంటుంది చెర్రీ- ఉపాసన జోడీ. ఇక తమ పెళ్లి రోజు సెలబ్రేషన్స్ కోసం చాలా సార్లు విదేశీ విహారయాత్రలకు వెళ్లి వచ్చిన ఈ కపుల్.. తాజాగా ఓ హోటల్‌లో లంచ్ డేట్‌కి వెళ్లి మెగా అభిమానులను కనువిందు చేశారు. ''మిడ్ వీక్.. లంచ్ బ్రేక్.. లంచ్ డేట్.. ఆల్వేస్ రామ్ చరణ్'' అని పేర్కొంటూ ఉపాసన ఈ ఫోటోని షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ క్యూట్ కపుల్, బ్యూటిఫుల్ అంటూ క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. రామ్ చరణ్ కెరీర్ విషయానికొస్తే.. పెండింగ్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. రెండు పాటలు మినహా ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. అలాగే తన తండ్రి చిరంజీవితో కలిసి 'ఆచార్య' మూవీలో భాగమవుతున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఫినిష్ కాగానే శంకర్‌తో మరో భారీ సినిమా చేయబోతున్నారు మెగా పవర్ స్టార్.
By July 08, 2021 at 08:04AM
No comments