Breaking News

శేఖర్ మాస్టర్ చనిపోయాడు.. గూగుల్ చేసిన పెద్ద పొరపాటు!! షాకవుతున్న ఫ్యాన్స్


టెక్నాలజీ బాగా పెరగడం, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో ఏ చిన్న అవసరం ఉన్నా గూగుల్ సెర్చ్ చేస్తున్నారు జనం. ముఖ్యంగా సెలబ్రిటీల తాలూకు విషయాలు, ఫొటోస్ కోసం గూగుల్ తల్లినే నమ్ముకుంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆ గూగుల్‌లో కనిపించే కొన్ని పొరపాట్లు షాకిస్తున్నాయి. గతంలో ఇలాంటివి కొన్ని జరగ్గా ఆ తర్వాత వాటిని సరిదిద్దారు. తాజాగా స్టార్ కొరియోగ్రాఫర్ విషయంలోనూ అదే జరిగింది. శేఖర్ మాస్టర్ పేరు సెర్చ్ చేయగానే గూగుల్‌లో వస్తున్న సమాచారం చూసి షాకవుతున్నారు జనం. శేఖర్ మాస్టర్ ఫోటోతో పాటు ఆయన పుట్టిన సంవత్సరం 1963 అని, చనిపోయిన రోజు జూలై 8,2003 అని వస్తోంది. ఇది చూసి ఆయన అభిమానులు అవాక్కాయ్యారు. బ్రతికి ఉన్న శేఖర్ మాస్టర్ 2003లో కన్నుమూసినట్లుగా చూపించడంతో గూగుల్‌పై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటనే.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కి బదులుగా నటుడు మాస్టర్ శేఖర్ ఇన్ఫర్మేషన్ గూగుల్ చూపిస్తోంది. తమిళనాడుకు చెందిన చైల్డ్‌ ఆర్టిస్ట్‌ జేవీ శేఖర్‌ని అందరూ మాస్టర్‌ శేఖర్‌ అనేవారు. దాదాపు 50 చిత్రాల్లో నటించిన ఆయన జూలై 8వ తేదీ 2003లో మరణించారు. ఆయన సమాచారాన్ని పొరపాటున కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ ఫోటోతో అప్‌లోడ్‌ చేసింది గూగుల్‌. గతంలో కూడా ఇలా గూగుల్ సెర్చ్ ఇంజిన్ పొరపాట్లు చాలానే చూశాం. కాగా, ప్రస్తుతం శేఖర్ మాస్టర్ ట్రెండ్ నడుస్తోంది. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరికీ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. సినిమా కోసం తెరవెనుక పనిచేయడమే గాక బుల్లితెరపై కెమెరా ముందు అలరిస్తున్నారు. జబర్ధస్థ్, ఢీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ హుషారెత్తిస్తున్నారు.


By July 22, 2021 at 07:40AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/google-search-engine-big-mistake-on-sekhar-master/articleshow/84626112.cms

No comments