Breaking News

సినిమా రౌండప్: రష్మిక ఆస్తుల లెక్క ఇదే.. సెప్టెంబర్‌లో పెళ్లి సందడి.. హన్సిక డేర్!!


సెప్టెంబర్‌లో పెళ్లి సందడి శ్రీకాంత్ తనయుడు రోషన్‌ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘పెళ్లి సందD’. గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీరవాణి బాణీలు కడుతున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబరు నెలలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రష్మిక ఆస్తుల లెక్క.. చలో అంటూ టాలీవుడ్ గడప తొక్కిన ఊహించనంత ఎత్తుకు ఎదిగింది. వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఆస్తుల చిట్టా కూడా ఎక్కువేనట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సమాచారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వైపు సినిమాలు, మరోవైపు వాణిజ్య ప్రకటనలతో బిజీగా ఉన్న ఆమె ఆస్తి విలువ 35 - 40 కోట్లుగా ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ప్రభాస్.. బ్యాక్ టు ఇండియా కొన్ని రోజుల క్రితం ఇటలీ వెళ్లిన ప్రభాస్.. తిరిగి ఇండియా వచ్చారు. బుధవారం ఉదయం ఆయన హైదరాబాద్‌లో అడుగు పెట్టడంతో ప్రభాస్‌తో సినిమాలు చేసే దర్శకనిర్మాతలు సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. చేతిలో ప్రస్తుతం రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్‌ సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు ప్రభాస్. 105 మినిట్స్‌: సింగిల్ సాధారణంగా ఓ సినిమా షూట్ చేయాలంటే చాలా నెలలు కష్టపడాల్సి వస్తుంది. కానీ హన్సిక మాత్రం సింగల్ టేక్ అంటోంది. ‘105 మినిట్స్‌’ అనే సినిమాలో ఆమె సింగిల్‌గా కనిపించబోతున్నారు. రాజు దుస్సా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుందట.


By July 22, 2021 at 08:41AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/july-22-movie-roundup-prabhas-hansika-rashmika-mandanna-in-news/articleshow/84626833.cms

No comments