శ్రీవారిని దర్శించుకున్న హీరో శ్రీకాంత్.. బాలయ్య బాబుతో చేస్తున్న 'అఖండ' సినిమాపై కామెంట్
టాలీవుడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న ఆయనను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ నుండి విముక్తి రావాలని స్వామివారిని మొక్కుకున్నానని శ్రీకాంత్ చెప్పారు. మొదటిసారి బాలకృష్ణతో విలన్‌గా చేస్తున్నాని, బాలకృష్ణ హిరోగా నటిస్తున్న 'అఖండ' చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నానని చెప్పారు. ఈ సినిమా రిలీజ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న వారిలో తాను కూడా ఒకడినని అన్నారు. అలాగే వీటితో పాటు కన్నడ చిత్రంలో నటిస్తున్నానని చెప్పిన శ్రీకాంత్.. తెలుగులో మరో చిత్రం 'మరణమృదంగం'లో హిరోగా చేస్తున్నానని చెప్పారు. తన కొడుకు రోషన్ హీరోగా రాబోతున్న 'పెళ్లి సందD' చిత్రం షూటింగ్ పూర్తయిందని, అతి త్వరలో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలిపారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రోషన్ సరసన శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇకపోతే బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న హాట్రిక్ మూవీ 'అఖండ'లో హీరో శ్రీకాంత్ రోల్ హైలైట్ కానుందని అంటున్నారు. బోయపాటి మార్క్ కనిపించేలా శ్రీకాంత్- బాలకృష్ణ మధ్య సన్నివేశాలు చిత్రీకరించారట. ''సింహా, లెజెండ్'' లాంటి సూపర్ డూపర్ హిట్స్ తర్వాత బాలకృష్ణ- బోయపాటి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో 'అఖండ'పై నందమూరి అభిమానుల్లో బోలెడన్ని అంచనాలు నెలకొన్నాయి.
By July 20, 2021 at 09:24AM
No comments