ఒలింపిక్ విలేజ్‌లో యాంటీ సెక్స్ బెడ్స్.. శృంగార ప్రియులకు నిరాశవద్దన్న ఐఓసీ!
కరోనా నేపథ్యంలో ఒలింపిక్స్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జపాన్ ప్రభుత్వం.. ఆటగాళ్ల ఆరోగ్యం విషయంలో అన్ని చర్యలూ తీసుకుంది. అయితే, ఒలింపిక్ విలేజ్‌లోని బెడ్స్ నాసిరకమైనవని, ఇవి సెక్స్ చేయడానికి పనికిరావంటూ మీడియాలో వస్తున్న కథనాలను నిర్వాహకులు తోసిపుచ్చారు. టోక్యో ఒలింపిక్ విలేజ్‌లోని పడకలు ధృఢమైనవని, మీడియాలో వస్తున్న నివేదికల్లో నిజం లేదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్పష్టం చేసింది. భౌతిక దూరాన్ని ప్రోత్సహించడానికి పడకలు ఉద్దేశపూర్వకంగా ధృఢమైనవి ఏర్పాటు చేయలేదని న్యూయార్క్ పోస్ట్ ఓ కథనం వెలువరించింది. ఈ విషయాన్ని నిరూపించడానికి ఐరిష్ జిమ్నాస్ట్ మెక్ క్లెంగన్ బెడ్‌పై నుంచి మీద పదేపదే దూకుతూ వీడియోను చిత్రీకరించాడు. ఈ వీడియోను ఐఓసీ ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. ‘పడకలు కార్డ్‌బోర్డ్‌తో తయారుచేసినవే.. కానీ, సెక్స్ చేయకుండా వాటిని ఆకస్మిక కదలికలతో విచ్ఛిన్నం కావడానికి ఉద్దేశించినవి తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించింది. ఐఓసీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఐరిష్ జిమ్నాస్ట్ మెక్‌లాంగన్‌కు ధన్యవాదాలు తెలిపింది. అక్కడ ఏర్పాటు చేసిన బెడ్స్ ధృఢమైనవని పేర్కొంది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ఆధారంగా అమెరికా డిస్టెన్స్ రన్నర్ పాల్ చెలిమో ఓ ట్వీట్ చేస్తూ..‘ఏర్పాటుచేసిన కార్డ్‌బోర్డ్ పడకలు అథ్లెట్లు లైంగిక చర్యల్లో పాల్గొనకుండా నివారించడానికి ఉద్దేశించినవే’ అని ఆరోపించారు.‘క్రీడలకు మించిన పరిస్థితులను నివారించడానికి పడకలు ఒకే వ్యక్తి బరువును తట్టుకోగలవు’ అని వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉండగా, ఈ బెడ్స్‌పై సందేహాలు రావడం ఇదే తొలిసారి కాదు. జనవరిలోనూ ఆస్ట్రేలియా బాస్కెట్‌బాల్ ఆటగాడు ఆండ్రూ బోగట్ వీటి సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేశాడు. దీనికి స్పందించిన తయారీ సంస్థ ఎయిర్‌వేవ్.. 200 కిలోల (440 పౌండ్ల) బరువును తట్టుకోగలవని, కఠినమైన ఒత్తిడి పరీక్షలు నిర్వహించామని సమాధానం ఇచ్చింది. ‘పై నుంచి బరువైన వస్తువులను వదలిపెట్టడం వంటి ప్రయోగాలు చేశాం.. మంచం మీద ఇద్దరు వ్యక్తుల భారాన్ని తట్టుకునేంత బలంగా ఉంటాయి’ అని పేర్కొంది. గతేడాది జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు.. కరోనా కారణంగా వాయిదాపడ్డాయి. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ క్రీడల్లో వేలాది మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ‘అనవసరమైన లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలని’ హెచ్చరికలు ఉన్నప్పటికీ, నిర్వాహకులు 160,000 కండోమ్‌లను అందజేయాలని భావిస్తున్నారు. అయితే, కండోమ్‌లను పంపిణీ చేయడం అంటే ఒలింపిక్ విలేజ్‌లో ఉపయోగించాలని అర్ధం కాదని పేర్కొన్నారు. అథ్లెట్లు తమ స్వస్థలాలకు సురక్షితంగా తిరిగి చేరుకోవడానికి సహకరిస్తూ అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
By July 20, 2021 at 09:34AM
No comments