Breaking News

ఆ పాన్ ఇండియా ప్రాజెక్టులో వినోదం తగ్గదు.. ప్రభాస్ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం


ఒకప్పుడు తెలుగులో ఓ సినిమా వచ్చిందంటే అందులో ఓ వ్యక్తికి పాత్ర ఉండాల్సిందే. ఆయన ఉంటేనే ఆ సినిమా సంపూర్ణం అవుతుంది. కేవలం తన హావభావాలతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన నటుడు ఆయన. స్క్రీన్ మీద ఆయన కనిపించారంటే చాలు థియేటర్లో నవ్వుల వర్షం కురుస్తోంది. ఇదంతా చూశాక ఆయనెవరో ఇప్పటికే మీకే అర్థం అయిపోయి ఉంటుంది. ఆయన హాస్య బ్రహ్మ.. కామెడీ కింగ్ . ఆయన సినిమా తెరపై మళ్లీ చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే కొంతకాలం క్రితం ఆయన ‘జాతిరత్నాలు’ అనే సినిమాలో జడ్జి పాత్రలో నటించి ప్రేక్షకులను పలకరించారు. చేసిన పాత్ర చిన్నది అయినప్పటికీ.. బ్రహ్మానందం క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా తర్వాత ఆయన మళ్లీ ఏ సినిమాలో కనిపిస్తారా.. అని ప్రేక్షకులు అంతా ఎదురుచూస్తున్నారు. అయితే బ్రహ్మానందం ఫ్యాన్స్‌కి ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చిత్ర బృందం శుభావార్త అందించారు. దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘ప్రాజెక్ట్ K’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యే సెట్స్‌పైకి వెళ్లింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ సోషల్‌మీడియాలో అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఈ ‘ప్రాజెక్ట్ K’ అనే సినిమాలో బ్రహ్మానందం కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆరోగ్యం సహకరించకపోయినా.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి బ్రహ్మానందం ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలో బ్రహ్మానందం ఏ పాత్రలో నటిస్తున్నారో.. ఆయన ఏ రేంజ్‌లో కామెడీని క్రియేట్ చేస్తారో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.


By July 26, 2021 at 01:27PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bramhanandam-to-act-in-nag-ashwin-and-prabhas-movie/articleshow/84753123.cms

No comments