పవన్ కళ్యాణ్ భార్య నిత్యామీనన్.. ఇక తగ్గేదే లే.. గెట్ రెడీ పవర్ స్టార్ ఫ్యాన్స్!
కరోనా సెకండ్ వేవ్ లాక్‌డౌన్ కారణంగా రద్దయిన సినిమా షూటింగ్స్ ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభమవుతున్నాయి. పెద్ద హీరోల సినిమాలు ఒక్కొక్కటిగా సెట్స్ మీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తాను కమిటైన సినిమాల షూటింగ్స్‌తో బిజీ కాబోతున్నారట. రానాతో కలిసి పవన్ చేస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ షూటింగ్ ఈ నెల 12 నుంచి తిరిగి ప్రారంభం కానుండగా 13వ తేదీ నుంచి పవన్ సెట్స్ పైకి రానున్నారట. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య రోల్ పోషిస్తోందట. తొలిసారి పవన్ కళ్యాణ్‌తో జోడీ కడుతున్న ఈ బొద్దుగుమ్మ త్వరలోనే షూటింగ్‌లో జాయిన్ కానుందట. ఇక తగ్గేదే లే అన్నట్లుగా ఆమెతో షూటింగ్ ఫినిష్ చేసేందుకు రెడీ అవుతున్నారట పవన్. ఇకపోతే ఈ సినిమాలో మరో హీరోగా దగ్గుబాటి రానా నటిస్తుండగా.. ఆయన సరసన ఐశ్వర్య రాజేశ్ ఆడిపాడుతోంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ఫినిష్ చేసిన యూనిట్.. మరి కొన్నినెలల్లో మిగిలిన భాగం కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారట. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 12గా ఈ 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్ రూపొందుతోంది. చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే- సంభాషణలు అందిస్తున్నారు. సాగర్. కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు క్రిష్ దర్శకత్వంలో రూపొందతున్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌లో కూడా పవన్ పాల్గొననున్నారు. ఈ రెండు సినిమాలపై పవర్ స్టార్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
By July 07, 2021 at 10:02AM
No comments