ప్రియమణి- ముస్తఫా మ్యారేజ్ ఇష్యూ: సీనియర్ హీరోయిన్ ఓపెన్.. వివాహ బంధంపై ఆమె రియాక్షన్ చూస్తే..
ఉన్నట్టుండి అనూహ్యంగా తెరపైకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2017 సంవత్సరంలో అనే వ్యక్తిని పెళ్లాడిన అతనితో దాంపత్య జీవితం కొనసాగిస్తోంది. అయితే ముస్తఫా రాజ్ మొదటి భార్య ఆయేషా వీళ్ళిద్దరిదీ చట్టబద్దమైన వివాహం కాదంటూ క్రిమినల్ కేసు ఫైల్ చేయడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ప్రియమణి రియాక్ట్ అయింది. ప్రియమణిని పెళ్లి చేసుకోకముందే 2010 సంవత్సరంలో ఆయేషాను వివాహం చేసుకున్నాడు ముస్తఫా రాజ్. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పలు కారణాలతో విడిపోయారు. ఆ తర్వాత ప్రియమణిని పెళ్లాడాడు ముస్తఫా. అయితే ముస్తఫా తనకు మాజీ కాదని, ఇప్పటికీ భర్తే అని చెబుతున్న ఆయేషా.. ప్రియమణితో ఆయన వివాహం చెల్లదనే ఆరోపణలు చేస్తోంది. తనకు అధికారికంగా విడాకులు ఇవ్వకుండా ప్రియమణిని పెళ్లాడాడని అంటోంది. దీంతో ఈ ఇష్యూపై రకరకాల రూమర్స్ బయటకొస్తున్నాయి. దీంతో దీనిపై స్పందించిన ప్రియమణి, తమది చట్టవిరుద్ధ వివాహం కాదని చెబుతూ రూమర్లను ఖండించింది. తాను సెక్యూర్ జోన్‌లో ఉన్నానని, తమ బంధానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పింది. ఎప్పటిలాగే ముస్తఫా లాంటి భర్త దొరకడం తన అదృష్టమని చెప్పిన ఆమె.. తమ మధ్య సరైన కమ్యూనికేషన్ ఉంటుందని చెప్పుకొచ్చింది. భార్యాభర్తల నడుమ అదే ముఖ్యమని చెప్పింది. ఇకపోతే తమ వివాహ బంధంపై అనుమానాలు వ్యక్తమవుతుండటం చూశానని అంటున్న ప్రియమణి.. ప్రస్తుతం మేము చాలా అన్యోన్యంగా ఉన్నాం. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టం చేసింది. ఒకానొక సమయంలో తెలుగు తెరను తన అందాలతో తడిపేసిన ప్రియమణి.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. ఇటీవలే 'నారప్ప' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె, మరికొద్ది రోజుల్లో 'విరాటపర్వం' మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది.
By July 23, 2021 at 07:44AM
No comments