Breaking News

మహారాష్ట్రలో విరిగిపడ్డ కొండ చరియలు.. చిక్కుకున్న 300 మంది?


దేశంలోని అనేక రాష్ట్రాలను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. వరద విలయంతో పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. మహారాష్ట్రలో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముంబయి మహానగరంతో పాటు రాష్ట్రంలోని పలు నగరాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ముంబై శివార్లలోని భివాండిలో వరద పోటెత్తడంతో వందలాది ఇళ్లు నీట మునిగాయి. కొండచరిచయలు విరిగిపడడంతో చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దింపారు. జిల్లాలోని మహద్ తలై గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో సుమారు 35 ఇళ్లు నేలమట్టమయ్యాయి. సుమారు 300 మంది ప్రజలు వాటి కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. భారీ వర్షాల కారణంగా ఘటనా స్థలం మొత్తం నీటితో నిండిపోవడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుందని రాయ్గఢ్ జిల్లా కలెక్టర్ నిధి చౌధురీ తెలిపారు. కొండచరియల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఆర్మీ, నేవీ బృందాలు రంగంలోకి దిగింది. శుక్రవారం ఉదయం నుంచి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.


By July 23, 2021 at 07:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/landslide-in-raigads-kalai-village-maharashtra-rescue-ops-delayed-due-to-rain-effect/articleshow/84664987.cms

No comments