Breaking News

దర్భాంగ పేలుళ్ల కేసు... మాలిక్ బ్రదర్స్ అమాయకులు అంటున్న తండ్రి


దర్భాంగా పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) లోతుగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఈ కేసులో హైదరాబాద్‌లోని మల్లేపల్లిలో నివాసం ఉంటున్న మాలిక్ బ్రదర్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇమ్రాన్, నాసిర్‌ బ్రదర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనిపై మాలిక్ బ్రదర్స్ తండ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. తన కొడుకులు అమాయకులు అంటున్నారు తండ్రి . తన కొడుకులు ఉగ్రవాదులు కాదని.. తాము ఏ తప్పు చేయలేదని చెబుతున్నారు మూసా ఖాన్. మూసా ఖాన్ గతంలో ఆర్మీలో పనిచేశారు. 1962లో జరిగిన ఇండో చైనా యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధం తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని కాయస్తవాడలో పెళ్లి సామాగ్రి వ్యాపారం చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. తన వ్యాపారానికి కొడుకులు మాలిక్, ఇమ్రాన్‌లు అండగా నిలిచేవారని వెల్లడించారు. తండ్రి వ్యాపారానికి అండగా చిన్న కొడుకు ఇమ్రాన్ మాలిక్ నిలబడ్డాడు. తన కొడుకులు తప్పు చేయలేదని వాదిస్తున్నారు ముసా ఖాన్. దీని‌ వెనక‌ కుట్ర దాగి ఉన్నట్లు తండ్రి వాదిస్తున్నారు. మరోవైపు ఎన్ఐఏ అధికారులు దర్భాంగ బ్లాస్ట్ కేసుకు సంబంధించి మాలిక్ బద్రర్స్‌ని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్లు ఇద్దరు కాదు.. ముగ్గురు అని తేలింది. దీంతో వీళ్లకు మహా నెట్‌వర్కే ఉన్నట్లు తెలుస్తోంది. వీరిపై బీహార్‌లో, ఢిల్లీలో కేసులు నమోదయ్యాయి. వీరు మరో పెద్ద టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి కేవలం బ్లాస్ట్‌లు కాకుండా ప్రమాదాలు సృష్టించే పని పెట్టుకుని జనం చావును కోరుకుంటున్నట్లు NIA అనుమానం వ్యక్తం చేస్తోంది.


By July 03, 2021 at 11:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/darbhanga-blast-case-terrorist-father-moosa-khan-comments/articleshow/84087000.cms

No comments