సిల్క్ స్మితను పరిచయం చేసిన డైరెక్టర్ ఆంథోని కన్నుమూత
గత కొన్ని నెలలుగా సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ప్రముఖ డైరెక్టర్ కమ్ నిర్మాత (75) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు గుండె నొప్పి రావడంతో శనివారం రోజు త్రిస్పూర్‌లోని మెడికల్ కాలేజీకి తరలించారు. అయితే చికిత్స పొందుతూనే ఆయన ఆదివారం రోజు తుదిశ్వాస విడిచారు. ఆంథోని ఇకలేరనే వార్త తెలిసి పలువురు మలయాళ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 'ఈస్ట్‌మన్' అనే స్టూడియో ప్రారంభించి ఫోటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆంథోని.. క్రమంగా దర్శకత్వం వైపు అడుగులు వేశారు. ‘ఇనాయే తేడి’ అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమై అంచెలంచెలుగా ఎదిగారు. ఆ తర్వాత ''అంబాడే న్జానే, ఐస్ క్రీమ్, వయల్'' వంటి చిత్రాలను తెరకెక్కించి ఫేమస్ అయ్యారు. దర్శకుడిగానే కాకుండా.. నిర్మాతగా, ఫోటోగ్రాఫర్‌గా రాణించారు ఆంథోనీ. సీనియర్ నటి సిల్క్ స్మితను వెండితెరకు పరిచయం చేసింది కూడా ఈయనే. మేకప్ లేకుండా సిల్క్ స్మితను ఫోటోలు తీసి డైరెక్టర్స్‌కు చూపించగా.. అందురూ ఆమెను హీరోయిన్‌గా తీసుకునేందుకు ఆసక్తి చూపించారని గతంలో ఆంథోనీ తెలిపారు. సిల్క్ మూవీకి ఆమెను హీరోయిన్‌గా తీసుకొని ఆమె పేరును స్మిత అని పెట్టడంతో సిల్క్ స్మితగా మారి గొప్ప విజయాలందుకుందని అప్పట్లో ఆయన తెలిపారు.
By July 05, 2021 at 10:43AM
No comments