Breaking News

రేపే కేంద్ర క్యాబినెట్ విస్తరణ.. తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కుతుందా?!


కేంద్ర మంత్రివర్గ విస్తరణపై గత నెల రోజులుగా వివిధ శాఖలతో ప్రధాని జరుపుతున్న సమీక్ష సమావేశాలు ఓ కొలిక్కి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ విస్తరణ బుధవారం జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికార యంత్రాంగానికి సూచనలు కూడా అందినట్లు తెలుస్తోంది. జులై 7న ఉదయం 11 గంటలకు లేదా 12 గంటలకు విస్తరణ ఉండే అవకాశాలున్నాయి. వాస్తవానికి జులై 3, 4 తేదీల్లోనే ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ, అనుకున్నట్టు ఆ తేదీల్లో విస్తరణ జరగలేదు. ఇక, మంత్రివర్గంలో కొత్తగా 20 మందికి చోటు దక్కనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి ఎక్కువ మందికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరినీ కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవడం లేదని సమాచారం. కొన్ని రోజులుగా వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. వారి వారి శాఖల పురోగతిని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొంటారు. ఈ భేటీల ఆధారంగా మోదీ ఓ కేంద్ర మంత్రులపై ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న కేంద్ర మంత్రుల్లో 7 నుంచి 8 మందిని మోదీ తొలగించనున్నట్లు ఢిల్లీ వేదికగా వార్తలొస్తున్నాయి. మిత్రపక్షాలకు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వనున్నారని సమాచారం. ఇక, మధ్యప్రదేశ్‌‌లో గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీలో చేరి, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జోతిరాదిత్య సింథియాకు కేబినెట్‌ హోదా ఖాయంగా కనిపిస్తోంది. బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్‌ మోదీ, అసోం, మహారాష్ట్ర మాజీ సీఎంలు శర్వానంద సోనోవాల్‌, నారాయణ రాణెలకు చోటు దక్కనున్నట్టు సమాచారం. అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చేలా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. బిహార్‌ నుంచి ఎల్జేపీ నేత పశుపతి పారస్‌, జేడీయూ ఎంపీలు ఆర్‌సీపీ సింగ్ (లలన్ సింగ్), సంతోష్‌ కుష్వాహా పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. బెంగాల్ నుంచి జగన్నాథ్ సర్కార్, శంతను ఠాకూర్, నితీశ్ ప్రమాణిక్, హరియాణా నుంచి బ్రిజేంద్ర సింగ్ లేదా సునీతా దుగ్గల్‌ రేసులో ఉన్నారు.


By July 06, 2021 at 07:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-narendra-modi-cabinet-expansion-likely-to-take-place-tomorrow/articleshow/84161357.cms

No comments