Breaking News

సీఎం కొడుకు పేరుచెప్పి వసూళ్లు.. అడ్డంగా దొరికిన మంత్రి అనుచరుడు!


కర్ణాటక బీసీ సంక్షేమ శాఖ మంత్రి బి శ్రీరాములు చిక్కుల్లో పడ్డారు. ఓ కాంట్రాక్టర్ నుంచి బలవంతంగా డబ్బులు వసూలుచేసినట్టు ఆరోపణలు రావడంతో ఆయన వ్యక్తిగత సహాయకుడు రాజణ్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని గురువారం రాత్రి అరెస్ట్ చేసిన బెంగళూరు సీసీబీ పోలీసులు.. శుక్రవారం విడుదల చేయడంతో దుమారం రేగుతోంది. అయితే, రాజణ్ణ వ్యవహారాల గురించి తనకేమీ తెలియదని మంత్రి శ్రీరాములు వివరణ ఇచ్చారు. సీఎం విజయేంద్ర పేరు చెప్పి పలు అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై రాజణ్ణను పోలీసులు అరెస్టు చేసిన తర్వాత మంత్రి తీవ్ర అసహనానికి గురయ్యారు. అతడి అక్రమాలపై తనతో ముందుగానే చెప్పి ఉంటే మందలించేవాడినని శ్రీరాములు విచారం వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడి ఉంటే అతడిని కాపాడే ప్రయత్నం చేయబోనని పేర్కొన్నారు. రాజణ్ణతో పరిచయం ఉన్నా అతడి అక్రమాలకు గురించి తనకు తెలియదని చెప్పుకొచ్చారు. అంతేకాదు, నా వ్యక్తిగత సహాయకుడు కాదని అన్నారు. రాజణ్ణ అరెస్టుపై విజయేంద్ర ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ప్రజా జీవితంలో మా దగ్గరకు వచ్చే వారందరినీ అనుమానించలేం.. అలాగని అశ్రద్ధగా ఉండకూడదు. ఇలాంటి వారివల్ల మాలాంటి వారికి చెడ్డపేరు రాకూడదు.. ప్రజలు కూడా ఇలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించారు. ఇటువంటి వ్యవహారాలు ప్రతిపక్షాల ఆరోపణలకు మరింత బలాన్నిస్తాయని విజయేంద్ర వ్యాఖ్యానించారు. తన పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి రాజణ్ణ డబ్బులు వసూలుచేసినట్టు విజయేంద్ర ఇచ్చిన ఫిర్యాదుతోనే పోలీసులు చీటింగ్ కేసు నమోదుచేశారు. రాజణ్ణ సహా మరి కొందరికి ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. తన పేరుతో మోసాలకు పాల్పడినట్టు రాజణ్ణకు సంబంధించిన 20 ఆడియో క్లిప్పింగ్‌లను విజయేంద్ర అందజేసినట్టు పోలీస్ వర్గాల సమాచారం. ‘రాజణ్ణను గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకుని ఏసీసీ, ఇద్దరు ఎస్‌లతో కూడిన ఓ బృందం ప్రశ్నించింది.. ఆడియో క్లిప్పింగుల్లోని వాయిస్‌ అతడిదేనా అని తెలుసుకోడానికి స్వర నమూనాల టెస్టింగ్ కోసం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపాం’ అని బెంగళూరు జాయింట్ కమిషన్ (క్రైమ్) సందీప్ పాటిల్ అన్నారు.


By July 03, 2021 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-minister-b-sriramulu-aide-held-for-duping-people-using-name-of-cm-son/articleshow/84085184.cms

No comments