Breaking News

సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. టిబెట్‌లో జిన్‌పింగ్ రహస్య పర్యటన


చైనా అధ్యక్షుడు టిబెట్‌లో గతవారం ఆకస్మికంగా పర్యటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. టిబెట్ సహా అరుణాచల్ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో ఉన్న నైంగ్చిలో జిన్‌పింగ్ పర్యటించారు. దీంతో మూడు దశాబ్దాల తర్వాత టిబెట్‌లో పర్యటించిన చైనా అధ్యక్షుడిగా గుర్తింపు పొందారు. చివరిసారిగా 1990లో నాటి చైనా అధ్యక్షుడు జియాంగ్ జిమిన్ టిబెట్‌లో పర్యటించారు. అయితే, 2011లో చైనా ఉపాధ్యక్షుడి హోదాలో జీ జింగ్‌పింగ్ ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చారు. చైనా అధికారిక మీడియా జున్హూ ప్రకారం.. కమ్యూనిస్టీ పార్టీ, దేశ చరిత్రలో తొలిసారి టిబెట్‌ 70 వ వార్షికోత్సవం సందర్భంగా అధ్యక్షుడు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. జులై 21న జిన్‌పింగ్ దక్షిణ చైనాలోని నైంగ్చి వద్ద గాలాయ్ గ్రామానికి చేరుకున్న జిన్‌పింగ్‌‌కు అక్కడ ప్రజలు ఘనస్వాగతం పలికారని తెలిపింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారని పేర్కొంది. టిబెట్‌లో పాలనలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అమలుచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా జిన్‌పింగ్ అన్నట్టు వివరించింది. టిబెట్ పీఠభూమి ప్రాంతంలో స్థిరత్వం, అత్యున్నత అభివృద్ధితో కొత్త అధ్యాయం లిఖిస్తామని అన్నారు. జిన్‌పింగ్ పర్యటన ముగిసే వరకూ చైనా అధికారిక మీడియా ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచింది. నైంగ్చిలో బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. సరిహద్దుల్లో భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. చైనీస్ భాషలో విద్యను ప్రోత్సహించడం ద్వారా.. స్థానిక బౌద్ధ మఠాలను క్రమంగా నియంత్రణలోకి తీసుకోవడం ద్వారా స్థానిక సంస్కృతిని అణచివేయడానికి చైనా కంకణం కట్టుకుందనే ఆరోపణలు వస్తున్నారు. ఇందులో భాగంగా చైనా నేతలు క్రమానుగతంగా టిబెట్‌ను సందర్శిస్తున్నారు. కానీ, ఇటీవల కాలంలో టిబెట్‌లో పర్యటించిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.


By July 24, 2021 at 09:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/china-president-xi-jinping-secretly-visits-tibet-first-trip-by-a-chinese-leader-in-3-decades/articleshow/84698927.cms

No comments