ప్రభాస్ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ అప్డేట్.. పూజా కార్యక్రమాల్లో అమితాబ్!
నాగ్ అశ్విన్ సినిమాపై ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ఇది పాన్ ఇండియన్ సినిమా కాదు.. అంతకు మించి అని అంతర్జాతీయ స్థాయికి చెందిన సినిమా అని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి డార్లింగ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే అంతకంతకూ ఈ సినిమా ఆలస్యమవుతూనే వస్తోంది. అసలే భారీ తారాగణంతో రాబోతోన్న ఈ మూవీపై టాలీవుడ్‌లో అంచనాలు ఆకాశాన్ని అంటేశాయి. ఇక ఇందులో , దీపికా పదుకొణె వంటి స్టార్ కాస్ట్ ఉండటంతో సినిమా స్థాయి పెరిగిపోయింది. ఇదొక సైంటిఫిక్ ఫిక్షన్ అని, పాన్ వరల్డ్ అంటూ నాగ్ అశ్విన్ చెప్పిన సంగతులు సినిమాపై అంచనాలు పెంచేశాయి. అయితే రాధేశ్యామ్ తరువాత మామూలుగా అయితే ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ ప్రారంభించాలి. కానీ పరిస్థితులన్నీ తారుమారు అవుతుండటంతో మధ్యలోకి కొన్ని ప్రాజెక్ట్‌లు వచ్చి చేరాయి. నాగ్అశ్విన్ సినిమా కోసం భారీ మొత్తంలోడేట్స్ అవసరం ఉండటంతో ప్రభాస్ వేరే సినిమాలను పూర్తి చేసేందుకు మొగ్గుచూపారు. ఇందులో భాగంగానే సలార్, ఆది పురుష్ వంటి చిత్రాలు లైన్‌లోకి వచ్చాయి. ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. నేడు (శనివారం) ప్రభాస్ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించబోతోన్నారు. దీని కోసమే అమితాబ్ బచ్చన్ హైద్రాబాద్‌కు వచ్చారని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఇంకాసేపటికి నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్ తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.
By July 24, 2021 at 09:28AM
No comments