చెప్పుకుంటే సిగ్గు.. అందరి ముందే ఏడిచాను! అలాంటి వాళ్లకు ఓపెన్ ఆఫర్ ఇస్తూ షకీలా షాకింగ్ కామెంట్స్
ఒకానొక సమయంలో స్టార్ హీరోలకు పోటీ ఇస్తూ పెద్ద పెద్ద దర్శకనిర్మాతలకు ముచ్చెమటలు పట్టించింది శృంగార తార షకీలా. ఆమె సినిమా రిలీజ్ ఉందంటే పెద్ద సినిమాలు సైతం సైడ్ అయిన రోజులు ఉన్నాయి. అయితే క్రమంగా ఆ ఫేమ్ తగ్గుతూ వచ్చింది. థియేటర్స్‌లో సినిమాల వేడి తగ్గిపోయింది. అయితే రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె మరోసారి సత్తా చాటాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సొంతంగా ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రారంభించి అందరికీ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది షకీలా. కరోనా కష్టకాలంలో థియేటర్స్ అన్నీ బోసిపోయాయి. పల్లె, పట్నం అనే తేడాలేకుండా అన్ని ఏరియాల్లో సినిమా హాల్స్ గేట్లకు తాళాలు పడ్డాయి. గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి ఉండటంతో క్రమంగా ఓటీటీల హవా పెరిగింది. బడా నిర్మాతలు సైతం ఓటీటీ బాట పడుతుండటం చూస్తున్నాం. ఇప్పటికే అల్లు అరవింద్ 'ఆహా' పేరుతో ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రారంభించగా.. హీరోయిన్ నమిత, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కూడా ఇదే బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. తాజాగా వారి బాటలోనే శృంగార తార షకీలా కూడా వెళుతోంది. తన ఓటీటీలో వరుసగా సినిమాలను రిలీజ్ చేయబోతున్నామని షకీలా తెలిపారు. గతంలో తన సినిమా విడుదల కోసం సెన్సార్ బోర్డు చుట్టూ తిరిగి ఎన్ని ప్రయత్నాలు చేసినా సెన్సార్ ఇవ్వలేదని, ఆ సమయంలో ప్రెస్ మీట్ పెట్టి అందరి ముందు ఏడిచానని షకీలా చెప్పారు. అవన్నీ చెప్పుకుంటే సిగ్గు చేటు అని చెప్పిన ఆమె.. చివరకు చేసేది లేక డిజిటల్ వేదికపై విడుదల చేశామని అన్నారు. ఇలా ఇంకెవ్వరికీ జరగకూడదు అనే ఉద్దేశంతోనే ఓటీటీని ప్రారంబిస్తున్నానని షకీలా తెలిపారు. 'ఇక మాకు ఎవ్వరూ సాయం చేయాల్సిన అవసరం లేదు.. మేమే చేస్తాం. రండి.. షార్ట్ ఫిలిమ్స్ చేసి మా ఓటీటీలో రిలీజ్ చేసుకోండి' అని ఆమె అన్నారు. ఇకపోతే షకీలా తెరకెక్కిస్తున్న సినిమాల్లో ఒకటి ‘అట్టర్ ప్లాప్ మూవీ’ అనే టైటిల్‌తో రూపొందుతుండగా.. మరొకటి 'రొమాన్స్' అనే పేరుతో తెరకెక్కుతోంది. సో.. చూడాలి మరి ఓటీటీ వేదికపై షకీలా హవా ఎలా ఉంటుందనేది!.
By July 19, 2021 at 08:36AM
No comments