Breaking News

భారత్ సహా రెడ్ లిస్ట్‌లో ఉన్న దేశాలకు వెళ్తే మూడేళ్ల బ్యాన్.. సౌదీ సంచలన నిర్ణయం


కొత్త వేరియంట్ల వెలుగు చూడటంతో కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా సౌదీ ప్రభుత్వం రెడ్ లిస్ట్‌లో చేర్చిన దేశాల్లో తమ పౌరులు అనుమతిలేకుండా పర్యటిస్తే మూడేళ్లపాటు నిషేధం విధించనుంది. ఈ మేరకు సౌదీ అధికార న్యూస్ ఏజెన్సీ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గతేడాది మార్చి నుంచి మొదటిసారిగా అధికారుల ముందస్తు అనుమతి లేకుండా మేలో విదేశాలకు వెళ్లడానికి అనుమతించిన కొందరు సౌదీ పౌరులు ప్రయాణ నిబంధనలను ఉల్లంఘించారని అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘వీరిలో ఎవరైనా చట్టబద్ధమైన నిబంధనలు ఉల్లంఘించినట్టు నిరూపణ అయితే తిరిగి వచ్చిన తరువాత భారీ జరిమానా విధిస్తాం.. మూడేళ్ల పాటు విదేశీ ప్రయాణాలపై నిషేధం తప్పదు’ అని అధికారులు తెలిపారు. భారత్, అఫ్గనిస్థాన్, అర్జెంటీనా, బ్రెజిల్, ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేషియా, లెబనాన్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, టర్కీ, వియత్నాం సహా పలు దేశాలపై సౌదీ అరేబియా ట్రావెల్ బ్యాన్ విధించింది. ‘కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ దేశాలు లేదా కొత్త వేరియంట్లు వ్యాపించిన ప్రాంతాలకు చెందిన పౌరులు నేరుగా లేదా మరొక దేశం ద్వారా రావడంపై ఇప్పటికీ నిషేధం కొనసాగుతోందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నొక్కి చెబుతోంది’ అని తెలిపారు. మొత్తం మూడు కోట్ల జనాభా ఉన్న సౌదీ అరేబియాలో ఇప్పటి వరకూ 5.20 లక్షల కేసులు నమోదు కాగా.. 8,189 మంది చనిపోయారు. మంగళవారం కొత్తగా 1,379 కేసులు నమోదయ్యాయి. గతేడాది జూన్‌లో అక్కడ రోజువారీ కేసులు గరిష్ఠానికి చేరుకున్నాయి. రోజువారీ కేసులు 4,000 నుంచి క్రమంగా ఈ ఏడాది జనవరి నాటికి 100కి తగ్గాయి. తిరిగి ఐదు నెలల తర్వాత మళ్లీ క్రమంగా పెరుగుతుండటంతో సౌదీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చింది. కొత్త వేరియంట్ల వెలుగులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు ఆంక్షలను కఠినతరం చేశాయి.


By July 28, 2021 at 07:29AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/covid-saudi-to-impose-3-year-travel-ban-for-those-visiting-red-list-countries/articleshow/84812592.cms

No comments