కాజల్ అగర్వాల్ గర్భవతి.. పెళ్లయ్యాక కొన్ని నెలలకే! ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కుటుంబ సభ్యులు
అదేంటో.. హీరోయిన్ల గురించి చిత్రవిచిత్రమైన రూమర్స్ బయటకొస్తుంటాయి. అందమైన భామల క్రేజ్ క్యాచ్ చేసుకుంటూ కొందరు అదే పనిగా ఓ రేంజ్ గాసిప్స్ పుట్టిస్తుండటం కామన్ అయింది. పెళ్లీడుకొచ్చిన హీరోయిన్ గురించి ఏ చిన్న హింట్ దొరికినా చాలు ఇక అస్సలు వదలరు గాసిప్ రాయుళ్లు. హీరోయిన్ లవ్ ఎఫైర్ అంటూ మొదలుపెట్టి ప్రెగ్నెన్సీ వార్తల దాకా తెగ పుకార్లు పుట్టిస్తుంటారు. అయితే ప్రేమ, పెళ్లి విషయంలో ఏ ఒక్కరికీ అలాంటి వాటికి ఛాన్స్ ఇవ్వని కాజల్.. ప్రెగ్నెన్సీ విషయంలో మాత్రం దొరికిపోయింది. కొన్నేళ్ల పాటు సీక్రెట్ లవ్ ఎఫైర్ నడిపించిన .. గతేడాది అక్టోబర్ 30వ తేదీన తన ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడింది. ఎవ్వరూ ఊహించని విధంగా పెళ్లి ప్రకటనతో షాకిచ్చిన ఈ బ్యూటీ.. మ్యారేజ్ అయ్యాక భర్తతో కలిసి రొమాంటిక్ టూర్స్ వేసింది. అందమైన ప్రదేశాలు చుట్టి వస్తూ ఆయా ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. దీంతో పెళ్లి జరిగాక ఏదో ఒక రకంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది కాజల్. ఈ నేపథ్యంలోనే కాజల్ గురించిన క్రేజీ న్యూస్ బయటకురావడంతో ఓ రేంజ్ చర్చలు మొదలయ్యాయి. కాజల్ ప్రస్తుతం అనే వార్తలు వైరల్ చేసేశారు గాసిప్ వీరులు. పెళ్లి ఎలాగైతే సీక్రెట్‌గా ఉంచిందో.. ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా అలాగే దాచేస్తోందని చెప్పుకున్నారు. ఫిలిం నగర్ అంతా అదే టాక్ నడిచింది. దీంతో ఈ విషయమై కాజల్ కుటుంబ సభ్యులు రియాక్ట్ అయి అసలు విషయం చెప్పేశారు. కాజల్ ప్రస్తుతం గర్భవతి కాదని, అవన్నీ రూమర్స్ మాత్రమే అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కాజల్ సినిమాల విషయానికొస్తే.. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలకు కమిట్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం చిరంజీవి సరసన 'ఆచార్య' సినిమాలో నటిస్తోంది. కొరటాల శివ రూపొందిస్తున్న ఈ మూవీ దసరా కానుకగా రిలీజ్ కానుందని సమాచారం.
By July 04, 2021 at 09:11AM
No comments