అందరి ముందే కాలు ఎత్తి మరీ ముద్దులు.. సూపర్ మార్కెట్‌లో రెచ్చిపోయిన శ్రుతీ హాసన్
సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. ప్రస్తుతం ఆమె తన ప్రియుడు శంతను హజారికతో చేసిన సందడి వైరల్ అవుతోంది. ప్రియుడితోనే ముంబైలో ఉంటున్న శ్రుతి హాసన్ నిన్న పబ్లిక్‌గా రెచ్చిపోయింది. ఓ సూపర్ మార్కెట్‌లో శ్రుతి హాసన్ చేసిన రచ్చ ఇప్పుడు వైరల్ అవుతోంది. వీకెండ్ సందర్భంగా అలా బయటకు వచ్చిన ఈ జంటను కెమెరా కళ్లు బంధించేసింది. ఇక ఇప్పుడు శ్రుతి హాసన్ అందరి ముందు చేసిన రొమాన్స్ అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఈ జంట ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొన్నీ మధ్య శ్రుతి హాసన్ ఓ వీడియోను షేర్ చేశారు. తన ప్రియుడు శంతనుతో కలిసి వంటగదిలో చికెన్ ఆరగిస్తున్న వీడియోను షేర్ చేశారు. మా ఇద్దరికీ ఫ్రైడ్ చికెన్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. ఎవరైతే ఇలా కలిసి తినగలరో.. వారు జీవితాంతం కలిసే ఉంటారని శ్రుతి హాసన్ అన్నారు. అలా వంటగదిలో వీరిద్దరూ ఆరగించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేసింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ జంట హాట్ టాపిక్ అయింది. ఓ సూపర్ మార్కెట్‌లో ఈ ఇద్దరూ వారానికి సరిపడా సరుకులను కొన్నట్టున్నారు. ఇక సూపర్ మార్కెట్‌లోనే అందరూ చూస్తుండగా రొమాన్స్ చేసేశారు. ప్రియుడి మీదకు కాలు వేసి.. అతడికి ముద్దు పెట్టేశారు. అయితే ఇందులోనూ ఓ మంచి విషయం ఏంటంటే.. ఆ ఇద్దరూ కూడా మాస్కులు ధరించి ఉన్నారు. కరోనా నిబంధనలో ఒకటి పాటించేశారు. అలా ఇప్పుడు శ్రుతి హాసన్ రెచ్చిపోయిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
By July 18, 2021 at 01:19PM
No comments