Breaking News

అది అవాస్తవం.. ‘పుష్ప’ సినిమాపై వస్తున్న రూమర్స్‌పై నటుడి క్లారిటీ


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘పుష్ప’. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూడో చిత్రమింది. రష్మికా మందన హీరోయిన్. ‘పుష్ప’ ద్వారా హిందీ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు. ‘పుష్ప’ను పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరున్న ఈ సినిమాను ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. గంధం చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమాలో లారీ డ్రైవర్ ‘పుష్పరాజ్’గా అల్లు అర్జున్ నటించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. సునీల్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా టీజర్‌లోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. అన్నికంటే మించి అల్లు అర్జున్ చివర్లో చెప్పే ‘తగ్గేదే లే’ అనే డైలాగ్‌కి మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సినిమాలో నటించే పూర్తి తారగణం గురించి ఇప్పటివరకూ క్లారిటీ లేదు. తాజాగా ఈ సినిమాలో ప్రముఖ నటుడు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని పలు ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. దీనిపై ఆనీష్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ‘కొన్ని వార్తలు నిజమతే బాగుటుంది కానీ దురదృష్టవశాత్తు అవి అబద్ధాలుగా మిగిలిపోతాయి’ అంటూ ఆశీష్ పోస్ట్ చేశారు. తను ఈ సినిమాలో నటించడం లేదని కాకపోతే.. ఎప్పటికైనా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో కలిసి నటించాలని తనకి కోరిక ఉందని ఆయన వెల్లడించారు.


By July 20, 2021 at 03:38PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-anish-kuruvilla-gives-clarity-about-his-role-in-pushpa/articleshow/84581390.cms

No comments