కత్తి మహేష్ ఆన్ స్క్రీన్.. థియేటర్స్‌లో బజార్ రౌడీ! పక్కాగా స్కెచ్చేసిన బర్నింగ్ స్టార్
బర్నింగ్‌స్టార్ హీరోగా కెఎస్ క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా ''. ఈసినిమాను సీనియర్ దర్శకుడు డి.వసంత నాగేశ్వరావు దర్శకత్వంలో తెరకెక్కించారు. సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. సంపూర్ణేష్ బాబుకి జోడిగా నటించింది. షియాజి షిండే, పృథ్వి, నాగినీడు,షఫి, సమీర్, కత్తిమహేష్ కీలక పాత్రలు పోషించారు. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సంపూ మార్క్ కనిపించేలా ఆద్యంతం నవ్వులతో ఈ మూవీ ఆకట్టుకుంటుందని అంటున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, టీజర్, మోషన్ పోస్టర్ మంచి స్పందన తెచ్చుకున్నాయని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టు నెలలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని అంటోంది చిత్రయూనిట్. అన్ని అంశాలు కలగలిపి రూపొందించిన ఈ సినిమా సంపూర్ణేష్ బాబు చిత్రాల్లో ఇది బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచిపోతుందని డైరెక్టర్ డి.వసంత నాగేశ్వరావు అన్నారు. అయితే గత కొన్ని నెలలుగా థియేటర్స్ మూతబడటంతో పెద్ద సినిమాలు సైతం ఓటీటీల బాట పట్టడం చూస్తున్నాం. కానీ ఈ 'బజార్ రౌడీ' మాత్రం పక్కాగా థియేటర్స్ లోనే రాబోతున్నాడట. అంతేకాదు ఇటీవలే మరణించిన కత్తి మహేష్‌ని వెండితెరపై చూపించబోతున్నారు దర్శకనిర్మాతలు. అతి త్వరలో చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
By July 20, 2021 at 03:11PM
No comments