Breaking News

బైడెన్‌కు శుభాకాంక్షలు చెప్పి చైనాకు సైలెంట్ వార్నింగ్ ఇచ్చిన మోదీ!


సందర్భంగా ఆ దేశాధినేత జో బైడెన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అయితే, మూడు రోజుల కిందట చైనా కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్నా కేంద్రం కానీ, దేశంలోని సీపీఎం తప్పా మరే రాజకీయ పార్టీగాని శుభాకాంక్షలు చెబుతూ చిన్న మెసేజ్ కూడా పెట్టలేదు. కమ్యూనిస్ట్ శతాబ్ది ఉత్సవాలకు కనీసం చిన్న సందేశం కూడా పంపకపోవడం దౌత్య సంబంధాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఇక, అమెరికా 245 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం జరిగాయి. ‘‘అమెరికా అధ్యక్షుడు , అమెరికా ప్రజలకు 245వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా భారత్, అమెరికాలు స్వేచ్ఛా విలువలను పంచుకుంటాయి.. మా వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిజంగా ప్రపంచ ప్రాధాన్యత ఉంది’’అని మోదీ ట్వీట్ చేశారు. ఇక, జులై 1న కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చైనా అధినేత జీ జిన్‌పింగ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఓ లేఖను రాశారు. ‘మార్కిజం-లెనినిజం అనేది సృజనాత్మక విధానం.. చైనా అభివృద్ధి కోసం దీనిని చైనా కమ్యూనిస్ట్ పార్టీ విభిన్నంగా ఉపయోగించింది’ అని సీతారాం ఏచూరీ తన లేఖలో పేర్కొన్నారు. అయితే, బీజేపీగానీ, కాంగ్రెస్ లేదా ఇతర పార్టీలు మాత్రం ఈ ఉత్సవాలను పట్టించుకోలేదు. సీపీసీ శతాబ్ది ఉత్సవాలు కేవలం ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ సంస్థవేకాదు.. 1949 నుంచి 72 ఏళ్లుగా ఆ పార్టీయే అధికారానికి పర్యాయపదంగా మారింది. తూర్పు లడఖ్‌ సరిహద్దుల్లో భారత్, చైనా సైన్యాల మధ్య ఏడాదికిపైగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎల్ఏసీ వద్ద భారత్‌కు నిరంతరం ఏదో ఒక రూపంలో చైనా ఇబ్బందులను కలిగిస్తోంది. ఇదిలా ఉండగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాలకు శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిని ప్రశ్నించగా.. అది ప్రభుత్వ కార్యక్రమం కాదని సమాధానం ఇచ్చారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా బీజేపీ శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం. ఇక, ఆగస్టు 1న చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ డే సందర్భంగా కూడా భారత్ నుంచి శుభాకాంక్షలు వెళ్లడం దాదాపు అసంభవంగానే కనిపిస్తోంది. అక్టోబరు 1న చైనా జాతీయ దినోత్సవం రోజున భారత ప్రభుత్వం శుభాకాంక్షలు అధికారికంగా తెలియజేస్తుంది.


By July 05, 2021 at 08:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-wishes-biden-on-4th-of-july-for-us-independence-day-sends-silent-message-to-china/articleshow/84131082.cms

No comments