Breaking News

సాయానికి మారు పేరు సోనూ సూద్! విద్యార్థుల కోసం మరో సంచలన నిర్ణయం.. భేష్ అంటున్న నెటిజన్లు


కరోనా కష్ట కాలంలో చేసిన సేవలు యావత్ భారతదేశం లోని ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకున్నాయి. పేద ప్రజల వెంట నేనున్నా అంటూ భరోసా కల్పిస్తూ రీల్ హీరో కాదు రియల్ హీరో అనిపించుకున్నారు సోనూ సూద్. ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ సమయంలో రోడ్డున్నపడ్డ రోజువారి కార్మికులను తన సొంత ఖర్చులతో వారి వారి సొంత గూటికి చేర్చిన సోనూ.. ఆ తర్వాత తన సేవలను విస్తరిస్తూ వచ్చారు. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటానంటూ సహాయక కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతిగా సాగుతున్న వేళ ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటుచేసి ప్రజల చేత దేవుడిగా కీర్తించబడ్డారు సోనూ. అంతటితో కూడా ఆయన సేవా కార్యక్రమాలు ఆగలేదు. సోనూ సూద్ ఫౌండేషన్ పేరిట ఓ స్వచ్చంద సంస్థ ప్రారంభించి ఆ సంస్థ ద్వారా తన సేవలను విస్తృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంటూ మంచి పనికి శ్రీకారం చుట్టారు సోనూ. పేద విద్యార్థులకు మేలు కలిగేలా నిర్ణయం తీసుకున్నారు. ఇది వ‌ర‌కే ఐ.ఎ.య‌స్ (IAS) చ‌ద‌వాల‌నుకునే పేద విద్యార్థుల కోసం త‌న ఫౌండేష‌న్ ద్వారా స‌హాయం అందిస్తాన‌ని ప్ర‌క‌టించిన ఆయన.. ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్స్‌గా (CA) మారాల‌నుకునే పేద విద్యార్థుల‌కు అండ‌గా నిలబడతానని హామీ ఇచ్చారు. సూద్‌ చారిటీ ఫౌండేష‌న్‌ ద్వారా ఈ సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు. సోనూ చేస్తున్న ఈ సేవలు చూసి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అతడే రియల్ హీరో అని పొగుడుతున్నారు. ఆన్ లైన్ వేదికలపై నెటిజన్స్ ప్రశంసలు గుప్పిస్తున్నారు. కొన్ని ప్రదేశాల్లో అయితే సోనూకు పాలాభిషేకాలు చేయడమే గాక దేవుడిగా కొలుస్తుండటం చూశాం. సాయం కోరిన వారికి అండగా నిలుస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న సోనూ ఆశయం చాలా గొప్పదే అని చెప్పుకోవచ్చు.


By July 02, 2021 at 07:43AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sonu-sood-takes-another-decision-for-poor-students-in-india/articleshow/84054843.cms

No comments