రోడ్డు ప్రమాదానికి గురైన బిగ్ బాస్ ఫేమ్ యాషిక కారు.. ఓ అమ్మాయి మృతి.. నటి పరిస్థితి విషమం!
బిగ్‌బాస్ ఫేమ్ నటి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. తమిళనాడు రాష్ట్రం చెంగల్‌పట్టు జిల్లా మామల్లాపురం సమీపంలో శనివారం అర్థరాత్రి ఒకటిన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నటి యాషిక తీవ్ర గాయాలపాలు కాగా, ఆమెతో కలిసి ప్రయాణం చేస్తున్న హైదరాబాదీ అమ్మాయి భవాని (28) ప్రాణాలు కోల్పోయింది. ఈ కారులో మరో ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారని, వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగంగా కారు నడుపుతూ డివైడర్‌ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అంటున్నారు. కారు ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు హుటాహుటిన వారిని దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చెప్పిన చెన్నై పోలీసులు.. యాషికతో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు మద్యం సేవించి ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రమాదంలో మృతిచెందిన వల్లిచెట్టి భవానీ మృతదేహాన్ని మమల్లాపురం పోలీసులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తమిళ చిత్రసీమలో పలు సినిమాల్లో నటిస్తోంది నటి యాషికా ఆనంద్. మోడల్, టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె 2016లో 'ధురువంగల్ పత్తినారు' సినిమాతో సినీ గడప తొక్కింది. ఆ తర్వాత 2018లో అడల్ట్ కామెడీ మూవీ 'చీకటి గదిలో చితక్కొట్టుడు, నోటా, అమ్మోరు తల్లి వంటి చిత్రాల్లో నటించి ఫేమ్ అయింది. అలాగే బిగ్ బాస్ 3 తమిళ సిరీస్‌లో పాల్గొని తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది యాషిక ఆనంద్.
By July 25, 2021 at 10:10AM
No comments