Breaking News

ఇది మరీ అరాచకం.. లోపల ధరించేవాటిపై శ్రుతీ హాసన్ ఫోటోలు.. ప్రియుడి వెక్కిరింతలు!


చర్యలు ఈ మధ్య శ్రుతి మించిపోతోన్నాయి. పబ్లిక్‌గా ప్రియుడి మీద పడిపోవడం, ముద్దులు పెట్టేయడం, ఇక ఇంట్లో అయితే ఆ ఆరాచకం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రోజూ ఏదో ఒకటి చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటున్నారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం ముంబైలో ఎంజాయ్ చేస్తున్నారు. శ్రుతీ హాసన్ తన పనిలో తాను బిజీగా ఉంటే.. తన ఆర్ట్ గీసుకునే పనిలో తాను బిజీగా ఉంటున్నారు. ఇక ఈ జంట చేసే చిలిపి పనులకు నెటిజన్లు షాక్ అవుతున్నారు. తాజాగా శ్రుతీ హాసన్ చేసిన పనికి ప్రియుడు సైతం నవ్వుకున్నారు. మొన్నటికి మొన్న ముంబైలోని ఓ సూపర్ మార్కెట్‌లో ఈ జంట హల్చల్ చేసింది. ప్రియుడి మీద కాలు ఎత్తి మరీ.. అతడిని ముద్దుల్లో ముంచెత్తింది. ఇక రెండ్రోజుల క్రితం తమ ఇంట్లోనే శ్రుతీ హాసన్ పిచ్చి పిచ్చిగా ఎగిరారు. ఆమెతో పాటుగా శంతను కూడా కాలు కదిపాడు. అకస్మాత్తుగా శ్రుతీ హాసన్ ఎగిరి వచ్చి ఆయన మీద పడింది. దీంతో శంతను ఒక్కసారిగా షాక్ అయ్యారు. అలా ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఇక శంతను గోడ మీద ఆర్ట్ వేసుకుని ప్రాక్టీస్ చేసుకోకుండా.. శ్రుతీ హాసన్ శరీరాన్ని వాడేసుకున్నారు. ఆమె నడుము భాగం మీద తన ప్రతిభను చూపించారు. నడుము చుట్టూ కూడా శంతను ఆర్ట్ వేసేశారు. థగ్ లైఫ్ అంటూ రాసేశారు. ఇక ఇప్పుడు శ్రుతీ హాసన్ మరో లెవెల్‌కు చేరుకున్నారు. తన మీద తనకు ఎంత ప్రేమ ఉందో చూపించేందుకు శ్రుతీ హాసన్ ఈ పని చేసినట్టున్నారు. కాళ్లకు ధరించే సాక్స్ మీద శ్రుతీ హాసన్ తన ఫోటోలను ప్రింట్ చేయించుకున్నారు. ఇదేంటి? ఇలా కూడా చేస్తారా? అని శంతను నవ్వేశారు. అవును నాకు నేనంటే ఇష్టం అందుకే ఇలా చేశాను అంటూ వాటిని కాళ్లకు ధరించుకున్నారు. మొత్తానికి శ్రుతీ హాసన్ మాత్రం ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తున్నారు. ఆమె ఇప్పుడు ప్రభాస్ పక్కన సలార్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.


By July 31, 2021 at 09:01AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/shruti-haasan-printed-her-photos-on-socks/articleshow/84913424.cms

No comments