Breaking News

గాంధీలతో పీకే భేటీ.. రాష్ట్రపతి ఎన్నికలపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు


కాంగ్రెస్ నేతలు , ప్రియాంక గాంధీలతో ఎన్నికల వ్యూహకర్త సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సీనియర్ నేత, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌ను రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెడతారనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. అయితే, ఈ ప్రచారాన్ని ఖండించారు. ప్రశాంత్ కిశోర్ తనతో రెండుసార్లు భేటీ అయ్యారు కానీ, తమ మధ్య రాష్ట్రపతి ఎన్నికలు లేదా 2024 సార్వత్రిక ఎన్నికల అంశమే చర్చకు రాలేదని ఆయన వివరించారు. ఎన్నికల వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు ప్రశాంత్ కిశోర్ చెప్పారని పేర్కొన్నారు. ఇరువురి భేటీలో ఎటువంటి రాజకీయ అంశాలూ ప్రస్తావనకు రాలేదని మరోసారి పవార్ స్పష్టం చేశారు. ‘రాష్ట్రపతి ఎన్నికల్లో నేను అభ్యర్ధిగా పేర్కొవడం చాలా తప్పు.. ఆ పార్టీకి (బీజేపీ) 300 మందికిపైగా ఎంపీలున్నారు.. అలాంటప్పుడు ఫలితం ఎలా ఉంటుందో నాకు తెలుసు.. నేను రాష్ట్రపతి అభ్యర్థిని కాదు’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, 2024 ఎన్నికల కోసం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. రాజకీయ పరిస్థితులు మారుతూ ఉంటాయని శరద్ పవార్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాహుల్, ప్రియాంకలను పీకే మంగళవారం కలవగా.. సోనియా గాంధీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇందులో పాల్గొన్నారు. అయితే, ఈ సమావేశం ముఖ్య అజెండా త్వరలో జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అంశం కాదని, ఇంకా పెద్ద విషయమే ఉందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్‌లో పీకే క్రియాశీలక పాత్ర గురించే చర్చ జరిగిందనే సంకేతాలను వెలువరించాయి. అయితే, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ.. ఎన్నికల వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. అంతేకాదు, తాను రాజకీయ నేతగా విఫలమయ్యాయని అంటూ.. జేడీయూలో ఎదురైన అనుభవాన్ని ప్రస్తావించారు. ఇక, 2019 ఎన్నికల ముందు కూడా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలను పవార్ చేసినా.. అవి మాత్రం ఫలించలేదు.


By July 15, 2021 at 08:11AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/after-prashant-kishor-meets-rahul-and-priyanka-sharad-pawar-brushes-off-speculation/articleshow/84429220.cms

No comments