Breaking News

బాణాల్లా దూసుకొచ్చిన బండరాళ్లు: కూలిపోయిన బ్రిడ్జ్..9 మంది మృతి.. వీడియో


హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆదివారం ఊహించని విధంగా కొండచరియలు విరిగిపడి 9 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. కిన్నౌర్‌ జిల్లా సంగాల్‌ లోయలో జరిగిన ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సంగ్లా-చిత్కుల్ రహదారిలలో బత్సేరి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులంతా రాజస్థాన్, మహారాష్ట్రకు చెందిన వారేనని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి పెద్ద పెద్ద బండరాళ్లు బాణాల్లా దూసుకొచ్చాయి. వాటి వేగానికి బత్సేరి లోయలో ఉన్న ఓ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. వేగంగా దూసుకొచ్చిన రాళ్లు సమీపంలో ఉన్న పలు కార్లు, పర్యాటకుల విశ్రాంతి గదులను ధ్వంసం చేశాయి చిత్కుల్ నుంచి సంగ్లాకు వెళ్తున్న ఓ వాహనంపై బండరాళ్లు పడడంతో అందులోని 9 మంది అక్కడికక్కడే చనిపోయారు. కొండ చరియలు విరిగిపడుతున్న దృశ్యాలను కొందరు స్థానికులు వీడియో తీశారు. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భూకంపం సంభవించినట్లుగా భారీ బండ రాళ్లు కిందకు దూసుకొచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పెద్ద సంఖ్యలో రాళ్లు రహదారి సహా పర్యాటకుల విశ్రాంతి గదులపై పడడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హిమాచల్‌లోని కిన్నౌర్‌ ప్రమాదంపై సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 వంతున పరిహారాన్ని అందజేయనున్నట్టు ప్రధాన మంత్రి ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన ‘హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్‌లో కొండచరియలు విరిగిపడి జరిగిన ప్రమాదం అత్యంత విచారకరం.. ఈ ప్రమాదంలో ప్రాణాల ను కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం.. దుర్ఘటన లో గాయపడ్డ వారికి చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేశాం.. వారు త్వరగా కోలుకోవాలని కోరుకొంటున్నాను’ అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ దుర్ఘటనలో చనిపోయినవారిని రాజస్థాన్‌లోని సికర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబంలోని ముగ్గురు మాయాదేవి (55), ఆమె కుమారుడు అనురాగ్ బియానీ (31), కుమార్తె రిచా బియానీ (25), జయపూర్‌కు చెందిన దీపా శర్మ (34), మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ప్రతీక్ష సునీల్ పాటిల్ (27), చత్తీస్‌గఢ్‌కు చెందిన అమోగ్ బాపత్ (27), సతీశ్ కట్కాబార్ (34), ఢిల్లీకి చెందిన డ్రైవర్ ఉమ్రాబ్ సింగ్ (42), ఉల్హాస్ వేద్‌పాఠక్ (37)‌లుగా గుర్తించారు


By July 26, 2021 at 08:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/boulders-roll-downhill-due-to-landslide-in-himachal-pradesh-resulting-in-bridge-collapse/articleshow/84747071.cms

No comments