Breaking News

Twitter వెంకయ్యకు ట్విట్టర్ షాక్.. తీవ్రంగా స్పందించిన ఉపరాష్ట్రపతి ఆఫీస్


సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. ఎం వెంకయ్యనాయుడుకు షాక్ ఇచ్చింది. ఆయన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ (వెరిఫైడ్ బ్యాడ్జి)ను తొలగిస్తూ శనివారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గత ఆరు నెలల నుంచి వెంకయ్య వ్యక్తిగత ఖాతా (@MVenkaiahNaidu) ఇన్‌యాక్టివ్‌గా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉపరాష్ట్రపతి కార్యాలయానికి చెందిన అధికారిని ఉటంకిస్తూ ఏఎన్ఐ ఓ కథనంలో తెలిపింది. ఈ ఖాతా నుంచి వెంక‌య్య‌ చివ‌రిసారి గతేడాది జులై 23న ట్వీట్ చేశారు. అయితే, ఉపరాష్ట్రపతి అధికారిక అకౌంట్ @VPSecretariatకు మాత్రం బ్లూటిక్ యథావిధిగా ఉంది. ప్రముఖ వ్యక్తులు, బ్లాండ్లకు ట్విట్టర్ ఇచ్చే బ్లూటిక్‌ను బట్టి అది గుర్తింపు పొందిన, యాక్టివ్‌గా ఉన్న అకౌంట్‌గా ధ్రువీకరించవచ్చు. ఉపరాష్ట్రపతి కార్యాలయం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ట్విట్టర్ కొద్ది గంటల్లోనే బ్లూ టిక్‌ను పునరుద్దరించింది. ఉప రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత తన సమాచారం అంతా అధికారిక ఉపరాష్ట్రపతి కార్యాలయ అకౌంట్ నుంచి పంపుతున్నారనీ అంత మాత్రాన యాక్టివ్‌గా లేనట్లు కాదని చెప్పడంతో ట్విట్టర్ తన తప్పును సరిచేసుకుంది. భారత్ సహనాన్ని ట్విట్టర్ పరీక్షించాలనుకుంటోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు, దేశానికి రెండో రాజ్యాంగ అధినేత పట్ల ఆ సంస్థ దారుణంగా వ్యవహరించిందని మండిపడ్డాయి. మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌లు 2019లో చనిపోయినప్పటికీ వారి ఖాతాలకు చాలా కాలం పాటు వెరిఫైడ్ బ్యాడ్జ్‌లను కొనసాగించిన విషయాన్ని ప్రస్తావించారు. ‘‘ఉపరాష్ట్రపతి రాజకీయాలకు అతీతుడు.. ఇది రాజ్యాంగ పదవి.. రాజ్యాంగ పదవుల్లోని అమెరికా నాయకులకు కూడా ట్విట్టర్ ఇదే విధంగా చేయగలదా?’’ అని ఐటీ మంత్రిత్వ శాఖ వర్గాలు ప్రశ్నించాయి. గత కొద్ది రోజులుగా ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమానికి అంత‌ర్జాతీయ ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త గ్రేట్ థ‌న్‌బ‌ర్గ్ మ‌ద్ద‌తు తెలిపేందుకు విడుద‌ల చేసిన టూల్‌కిట్ వివాదాస్ప‌ద‌మైంది. దీంతో రైతుల ఉద్యమంపై అంతర్జాతీయ సమాజం దృష్టి పడింది. అప్పటి నుంచి ట్విట్టర్, కేంద్రం మధ్య ఘర్షణ కొనసాగుతోంది.


By June 05, 2021 at 11:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/twitter-briefly-drops-blue-tick-from-vice-president-venkaiah-naidu-personal-handle/articleshow/83254993.cms

No comments