Son Of India: జయజయ మహావీర సాంగ్ రిలీజ్.. మోహన్ బాబుపై అమితాబ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సీనియర్ హీరో మంచు లీడ్ రోల్‌లో రాబోతున్న కొత్త సినిమా ''. చాలా కాలం తర్వాత ఈ డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మోహన్ బాబు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌బాబుకు స్టైలిస్ట్‌గా ఆయన కోడలు మంచు విరానికా వ్యవహరిస్తుండగా.. మంచు విష్ణు నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ''జయజయ మహావీర'' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. సన్ ఆఫ్ ఇండియా సినిమాకు సంబంధించి 11వ శతాబ్దపు రఘువీర గద్యం.. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో రాహుల్ నంబియార్ స్వరంతో లిరికల్ వీడియోగా మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ పాటని మర్యాద పురుషోత్తముడైన శ్రీ రాముడికి అంకితం ఇస్తున్నాను అని ముందుగానే ప్రకటించిన మోహన్ బాబు.. తాజాగా ఈ 'జయజయ మహావీర' పాటతో అట్రాక్ట్ చేశారు. అయితే ఈ పాటను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ''ఇండియన్ సినిమాకు గొప్పవాళ్ళైన మోహన్ బాబు, ఇళయరాజా కాంబినేషన్‌లో శ్రీరాముడి గొప్పతనాన్ని చాటిచెప్పేలా రఘువీర గధ్యం పాటను కంపోజ్ చేశారు. సన్ ఆఫ్ ఇండియా సినిమాకు నా బెస్ట్ విషెస్'' అని పేర్కొన్నారు బిగ్ బీ. ఇకపోతే దేశభక్తి ప్రధానాంశంగా రాబోతున్న ఈ 'సన్ ఆఫ్ ఇండియా' మూవీలో మంచి మెస్సేజ్ మాత్రమే కాకుండా మోహన్ బాబు అభిమానులకు నచ్చేవిధంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను కూడా ఉంటుందని సమాచారం. ఇది ఇప్పటివరకు చూడని డిఫరెంట్ జానర్ ఇది అని, మోహన్ బాబు నటన అందరినీ ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్న మాట. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకొని సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.
By June 15, 2021 at 01:37PM
No comments