RGV: అరియానాతో ఆర్జీవీ హాట్ వర్కవుట్స్.. డైరెక్టర్ చూపంతా అక్కడే! బాబోయ్ ఆ కామెంట్స్ చూస్తే..
వివాదాస్పద దర్శకుడు, విభిన్నంగా ఆలోచించే డైరెక్టర్, తనకు మాత్రమే నచ్చే సినిమాలు చేస్తూ వెళ్లే డైరెక్టర్.. ఇలా చెప్పుకుంటూ పోతే స్పెషాలిటీస్ చాలానే ఉంటాయి లెండి. ముఖ్యంగా రొమాంటిక్ ముచ్చట్లు చెప్పడంలో వర్మ దిట్ట అనే సంగతి మనందరికీ తెలుసు. హీరోయిన్ల అందాలను తనదైన కోణంలో కెమెరాలో బంధించి రక్తి కట్టించడం ఒక్క వర్మకే చెల్లుతుందేమో..! కరోనా లాక్ డౌన్ వేళ ఆయన వదిలిన సినిమాలు చూస్తే అది ఎవ్వరికైనా అర్థమవుతుంది. అలాంటి వర్మ బిగ్ బాస్ ఫేమ్ అరియానాతో కలిసి రచ్చ రచ్చ చేయడం హాట్ టాపిక్ అయింది. అంతేకాదండోయ్.. ఆ ఫొటోలను ఆయనే స్వయంగా పోస్ట్ చేసి మరోసారి మ్యాటర్ జనాల్లో హాట్ ఇష్యూ చేసేశారాయన. అరియానా, రామ్ గోపాల్ వర్మ అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తొచ్చేది ఒకే ఒక్క సీన్. అదే రామ్ గోపాల్ వర్మను అరియానా ఇంటర్వ్యూ చేస్తుండగా.. నేరుగా నిన్ను బికినీలో చూడాలని ఉందంటూ మనోడు ఓపెన్ కావడం. ఈ ఒక్క సీన్ అరియానా కెరీర్‌నే టర్న్ చేసిందని చెప్పుకోవచ్చు. అప్పటిదాకా కొందరికే తెలిసిన ఈ బ్యూటీ వర్మ కామెంట్ తర్వాత ఫుల్ పాపులర్ అయింది. ఏకంగా బిగ్ బాస్ ఛాన్స్ పట్టేసి బోల్డ్ బ్యూటీగా ఫేమస్ అయింది. అయితే ఎన్నో సందర్భాల్లో తనకు లైఫ్ ఇచ్చిన గురించి మాట్లాడిన అరియానా.. రీసెంట్‌గా వర్మను మీట్ అయింది. ఆయన్ను మరోసారి ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లిందట అరియానా. ఇంకేముంది అరియానను కలిసిన వర్మ తనదైన రూటులో దూసుకుపోయారు. జిమ్ములో హాట్ వర్కవుట్స్ చేస్తూ ఆమెతో కలిసి పోజులిచ్చి సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేశారు. రీసెంట్‌గా ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగానే మరికొన్ని ఫొటోలను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు వర్మ. ఈమె ఎవరో గుర్తు పట్టండి అని నెటిజన్లను అడుగుతూ అరియానా హాట్ యాంగిల్స్ పోస్ట్ చేశారు. అయితే ఈ ఫొటోల్లో ఒక ఫొటో మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. దానికి కారణం అరియానా వర్కవుట్ చేస్తుంటే ఆర్జీవీ ఆమె క్రింద భాగంపై ఫోకస్ పెట్టి అక్కడే చూస్తూ కనిపించడం. మొత్తానికైతే తాజాగా మరోసారి అరియానాతో కలిసి ఆర్జీవీ చేసిన రచ్చ ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తోంది. నెటిజన్స్ రొమాంటిక్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు.
By June 16, 2021 at 09:48AM
No comments