Breaking News

Prudhvi Raj : బాల్కనీలో నిల్చుని డబ్బులు రోడ్డు మీదకు విసిరేవారు.. శ్రీహరిపై నటుడు సెన్సేషనల్ కామెంట్స్


స్వర్గీయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. విలన్‌గా వేషాలు వేసినా, హీరోగా నటించినా, సపోర్టింగ్ రోల్స్ చేసినా శ్రీహరి పరకాయ ప్రవేశం చేస్తుంటారు. రియల్ హీరోగా శ్రీహరి తెలుగు నాట మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. డిస్కో శాంతితో శ్రీహరి ప్రేమ, పెళ్లి అప్పట్లో సంచలనానికి దారి తీసింది. తెరపైనే కాకుండా తెర వెనుకా శ్రీహరి నిజంగానే రియల్ హీరో. ఎన్నో గుప్తదానాలు చేశారు. ఆయన మరణానంతరం కుటుంబం ఎన్ని కష్టాలు పడుతుందో డిస్కో శాంతి ఆ మధ్య చెబుతూ కన్నీరుపెట్టుకున్నారు. ఆయన ఎంతో మందికి సాయం చేశారు.. ఎన్నో దానాలు చేశారు.. సొంత వాళ్లు కూడా ఆయన ప్రాపర్టీని వాడుకున్నారు. ఇప్పుడు ఏ ఒక్కరూ కూడా సాయం చేయడం లేదు అంటూ శ్రీహరి గుప్తదానాల గురించి డిస్కో శాంతి చెబుతూ ఆ మధ్య ఎమోషనల్ అయ్యారు. ఇండస్ట్రీలోనూ ఎంతో మంది శ్రీహరి సేవా గుణాన్ని చెబుతుంటారు. మరీ ముఖ్యంగా బాలాపూర్ ప్రజలు శ్రీహరిని తమ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. తాజాగా కూడా శ్రీహరి గొప్పదనాన్ని వివరించారు. ఆయన తాజాగా సుమ క్యాష్ షోలో అతిథిగా విచ్చేశారు. వచ్చే శనివారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో బెనర్జీ, పృథ్వీ, జ్యోతి, సుదర్శన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ షోలో శ్రీహరి, ఉదయ్ కిరణ్‌ల గురించి అందరూ తలుచుకున్నారు. శ్రీహరి మనస్తత్వం గురించి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ మాట్లాడుతూ.. ‘ఆయన ఎంత గొప్పవారంటే.. జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఆయన ఇంటి ముందు ఎవరైనా ఉంటే.. బాల్కనీ నుంచి డబ్బులో రాయిని చుట్టి గుడ్డ కట్టి విసిరేవారు..వాళ్లు అలా తీసి చూసుకుని ఆయనకు దండం పెట్టేవారు. కొన్ని వేల గుప్తదానాలు చేశారు’ అని చెప్పుకొచ్చారు.


By June 07, 2021 at 08:24AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/comedian-prudhvi-about-srihari-in-suma-cash-show/articleshow/83297647.cms

No comments