Breaking News

Nandigram Election విచారణ నుంచి ఆ జడ్జి తప్పించండి: హైకోర్టుకు మమతా సంచలన లేఖ


నందిగ్రామ్‌లో బీజేపీ నేత సువేందు అధికారి ఎన్నిక చెల్లదంటూ బెంగాల్ సీఎం దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై కలకత్తా హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. అక్కడ అక్రమాలు జరిగాయంటూ బెంగాల్ సీఎం హైకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కౌశిక్‌ చందా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. అయితే, జస్టిస్ కౌశిక్ చందాను విచారణ నుంచి తప్పించాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్ బిందాల్‌కు మమతా బెనర్జీ లేఖ రాశారు. జస్టిస్ కౌశిక్ చందాకు బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నాయని, ఆయన ఆ పార్టీలో సభ్యుడని దీదీ తన లేఖలో పేర్కొన్నారు. ఈ ఎన్నికల పిటిషన్‌పై ఆయన విచారణ చేపడితే తనకు న్యాయం జరగదని మమతా అభిప్రాయపడ్డారు. కాబట్టి ఈ పిటిషన్ విచారణను వేరే న్యాయమూర్తికి బదిలీ చేయాలని బెంగాల్ సీఎం కోరారు. ఈ మేరకు మమతా బెనర్జీ తరఫున ఎన్నికల పిటిషన్ వేసిన ఏఓఆర్ సంజయ్ బసు లేఖ రాశారు. న్యాయవ్యవస్థ, ఘనత కలిగిన ఈ న్యాయస్థానంపై తన క్లయింట్‌కు పూర్తి విశ్వాసం ఉందని వివరించారు. ‘‘ఎన్నికల పిటిషన్ తీర్పులో రాజకీయ ఆమోదాలు కూడా ఉంటాయి. గౌరవనీయ న్యాయమూర్తి పక్షపాతం వ్యవహరిస్తారనే సహేతుకమైన భయం నా క్లయింట్ (మమతా బెనర్జీ)కి మనసులో ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘జస్టిస్ కలకత్తా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ఇంకా ధ్రువీకరించలేదు.. ఈ విషయమై మమతా బెనర్జీ అభిప్రాయాన్ని ప్రధాన న్యాయమూర్తి కోరారు. దీనిపై నా క్లయింట్ తన అభ్యంతరాలను, రిజర్వేషన్లను తెలియజేశారు. న్యాయమూర్తి పక్షపాతంతో వ్యవహరిస్తారని భావిస్తున్నారు’’ అని అన్నారు. కలకత్తా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా కౌశిక్ చందాను నియమించడంపై దీదీ తన లేఖలో అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి బరిలో నిలిచిన దీదీ.. 2000 ఓ ట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. లంచం, ద్వేషం, శత్రుత్వాన్ని పెంపొందించడం, మతం, బూత్‌ల ఆధారంగా ఓట్లు కోరడం; ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఫారమ్ 17 సిలో అవకతవకలు; నమోదయిన ఓట్ల సంఖ్య.. ఫలితాల్లో అక్రమాలకు పాల్పడినట్టు దీదీ ఆరోపించారు.


By June 19, 2021 at 07:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mamata-banerjee-objects-to-justice-kausik-chanda-hearing-her-election-petition/articleshow/83656514.cms

No comments