Breaking News

Maestro: నితిన్ కొత్త సినిమా షూటింగ్ ఫినిష్.. గుమ్మడికాయ కొట్టేసిన ‘మ్యాస్ట్రో’ యూనిట్


హీరోగా ‘అంధాదూన్‌’సినిమాకు రీమేక్‌గా రూపొందుతున్న కొత్త సినిమా 'మాస్ట్రో'. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశామని, ఇక శరవేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుపుతామని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో నితిన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో జరిగిన తుది షెడ్యూల్‌లో నితిన్‌, త‌మ‌న్నాల‌పై కీల‌క స‌న్నివేశాల చిత్రీకరణ జరిపారు. ఈ సన్నివేశాలు సినిమాకే హైలైట్ కానున్నాయని అంటున్నారు. ‘అంధాదూన్‌’ సినిమాలో టబు చేసిన పాత్రను తెలుగులో తమన్నా పోషిస్తోంది. ఇంకా ఈ మూవీలో న‌రేశ్‌, శ్రీ ముఖి, అనన్య, హర్షవర్ధ‌న్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాసరెడ్డి త‌దిత‌రులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఈ ‘మ్యాస్ట్రో’ మూవీని రూపొందిస్తున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, ఇతర అప్‌డేట్స్ మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. కరోనా కారణంగా కాస్త ఆలస్యమైన ఈ సినిమా విడుదల తేదీని అతి త్వరలో అనౌన్స్ చేయనున్నారు. రీసెంట్‌గా మూవీ గురించి ట్వీట్ చేసిన తమన్నా.. మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ సినిమాపై హైప్ పెంచేసింది.


By June 20, 2021 at 03:45PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nithiins-maestro-movie-shooting-finished/articleshow/83686741.cms

No comments