Breaking News

Fathers day: తండ్రిని తలచుకుంటూ సురేఖావాణి కూతురు ఎమోషనల్ కామెంట్స్.. తిరిగి రా నాన్న అంటూ!


నవ మాసాలు మోసి బిడ్డ ఆలనా పాలనా చూసుకునేది తల్లి అయితే.. అవిశ్రాంతంగా శ్రమిస్తూ బిడ్డ భవిష్యత్ కోసం ఆరాటపడేవాడు తండ్రి. వెన్నంటి నాన్న ఉన్నారంటే అంతకుమించిన భరోసా ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు. బిడ్డ ఎదుగుదలలో నాన్న పాత్ర ఎంతో కీలకం. అయితే కొందరి లైఫ్‌లో నాన్న ప్రేమ పొందే అదృష్టం ఎక్కువ కాలం ఉండదు. తండ్రి మరణం తీరని శోకాన్ని మిగుల్చుతుంది. దీంతో నాన్న జ్ఞాపకాలు ఊపిరి ఉన్నంతవరకూ గుండెల్లో దాచుకుంటూ బరువెక్కిన హృదయంతో గడుపుతుంటాడు ఆ బిడ్డ. కాగా, ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రిని తలచుకుంటూ ఎమోషనల్ అయింది సుప్రిత. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లను ఎంటర్‌టైన్ చేసే .. తాజాగా తన తండ్రి సురేష్ తేజతో దిగిన ఓ పిక్ పోస్ట్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ''ఐ లవ్ యూ నాన్న.. రెండేళ్ల క్రితం నాతో ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నప్పటి ఫొటో ఇది. అప్పుడు నాకు తెలియదు అదే నాతో నువ్వు చేసుకునే లాస్ట్ ఫాదర్స్ డే అని.. నా కోసం తిరిగి రా నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే'' అంటూ తీవ్ర భావోద్వేగం చెందింది. గతంలో కూడా చాలాసార్లు తన తండ్రి సురేష్ తేజపై ఉన్న ప్రేమను ఆమె బయటపెట్టింది. సుప్రిత ఇప్పటికే పలు ప్రైవేట్ ఆల్బమ్స్, యాడ్స్‌లోనూ నటించింది. త్వరలోనే సినీరంగ ప్రవేశం కూడా చేయబోతోతన్నట్టు తెలుస్తోంది. తల్లి సురేఖ వాణితో కలిసి ఆమె చేస్తున్న వీడియోలు, ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. సురేష్ తేజ మరణం తర్వాత సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ వచ్చిన వార్తలను సుప్రిత ఖండించిన సంగతి తెలిసిందే. మరోవైపు పలువురు సినీ సెలెబ్రిటీలు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ తమ తండ్రితో దిగిన పిక్స్ షేర్ చేస్తున్నారు.


By June 20, 2021 at 03:06PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/fathers-day-surekha-vani-daughter-supritha-emotional-comments/articleshow/83686157.cms

No comments