Jr Ntr: స్నేహానికి విలువనిచ్చే వ్యక్తిత్వం అరుదు.. క్షణాల్లో వైరల్ అయిన ఎన్టీఆర్ సందేశం
టాలీవుడ్‌లో అనతికాలంలోనే దర్శకుడిగా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సంపాదించారు కొరటాల శివ. సామాజిక కోణంలో స్టార్ హీరోలతో సినిమాలు రూపొందిస్తూ వరుస విజయాలందుకున్నారు. మొదట పలు హిట్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, మాటల రచయతగా పని చేసిన ఆయన ప్రభాస్ హీరోగా వచ్చిన ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత తెలుగు తెరపై తనదైన మార్క్ చూపిస్తూ వచ్చారు కొరటాల. అయితే నేడు (జూన్ 15) కావడంతో ఆయనకు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. ''స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు'' అని ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ని బట్టి ఎన్టీఆర్- కొరటాల మధ్య ఏ రేంజ్ స్నేహబంధం ఉందనేది అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎన్టీఆర్‌తో 'జనతా గ్యారేజ్' సినిమా రూపొందించి సూపర్ సక్సెస్ ఇచ్చారు కొరటాల. మళ్ళీ ఈ ఇద్దరి కాంబోలో రీసెంట్‌గా కొత్త సినిమా అనౌన్స్ కావడం నందమూరి అభిమానులను హుషారెత్తించింది. RRR మూవీ కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కనున్న మూవీ సెట్స్ పైకి రానుంది. ఎన్టీఆర్ 30వ సినిమాగా రానున్న ఈ మూవీలో ఎన్టీఆర్ అమాయక చక్రవర్తిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' మూవీ చేస్తున్నారు కొరటాల శివ. రామ్ చరణ్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అతిత్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
By June 15, 2021 at 09:25AM
No comments