Breaking News

యూపీ: ఫలించిన లూప్ టెక్నిక్.. బోరుబావి నుంచి సురక్షితంగా చిన్నారి


ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్ర జిల్లా ఫతేబాద్ దరియా గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలుడు శివ సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన విషయం తెలిసిందే. ఎనిమిది గంటల తీవ్రంగా శ్రమించి ఆ చిన్నారిని ప్రాణాలతో బయటకు తీశారు. ఎన్‌డీఆర్ఎఫ్, ఆర్మీ, జిల్లా యంత్రాంగం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. సోమవారం ఉదయం 7.30 గంటలప్పుడు ఇంటికి సమీపంలోని బోరుబావి వద్ద శివ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. బాలుడి అరుపులు విన్న స్థానికులు ఆ చిన్నారిని రక్షించేందుకు యత్నించారు. కానీ ఇవి విఫలమై బావిలోపలికి బాలుడు జారిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. బోరుబావిలోకి ఆక్సిజన్ అందిస్తూ సమాంతరంగా గుంతను తవ్వడం ప్రారంభించారు. బాలుడి పరిస్థితిని తెలుసుకునేందుకు మైక్రో కెమెరాలను బావిలోకి దింపారు. బాలుడి కదలికలను గమనిస్తూ సహాయక చర్యలు కొనసాగించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఆపరేషన్ సాయంత్రం 4.30 గంటల వరకు సాగింది. ఆగ్రా ప్రత్యేక ఎస్పీ మునిరాజ్ మాట్లాడుతూ.. రెస్క్యూ బృందం చిన్నారిని సురక్షితంగా బయటకు తీశాయని తెలిపారు. బాలుడ్ని బయటకు తీసిన తర్వాత వైద్య బృందం పరీక్షించి ప్రథమ చికిత్స చేసింది.. తదుపరి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి నిలకడా ఉందని అన్నారు. బోరుబావిలో చిన్నారి 90 అడుగుల లోతున ఉన్నట్టు గుర్తించి పైపు సాయంతో ఆక్సిజన్ పంపారు. లోపలికి బిస్కెట్లు, ఓఆర్ఎస్‌ను పంపారు. బయట నుంచి తన సొదరుడు పిలుపునకు బాలుడు స్పందించడంతో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమయ్యింది. మొత్తం 32 మంది ఎన్డీఆర్ఎఫ్, 28 మంది ఎస్డీఆర్ఎఫ్, అంతే సంఖ్యలో పరా బ్రిగేడ్‌కు చెందిన ఆర్మీ సిబ్బంది పాల్గొన్నారు. ‘లూప్ టెక్నిక్స్’ ఉపయోగించి బాలుడ్ని బయటకు తీశారు.. బోరుబావి లోపలికి వదులుగా ముడి వేసిన తాడు పంపి, చిన్నారి చేతిని లాక్ చేశారు.. అనంతరం తాడుతో పైకి లాగారు’అని ఎస్పీ వివరించారు. ముందు సమాంతరంగా గుంతను తవ్వడం ప్రారంభించినా.. చాలా జాప్యం జరుగుతుందనే ఉద్దేశంతో పక్కటనబెట్టారు.


By June 15, 2021 at 09:42AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/boy-rescued-from-180-ft-deep-bore-well-after-8-hours-operation-in-up/articleshow/83532186.cms

No comments