Breaking News

HBD Prasanth Neel.. యంగ్ టైగర్, ప్రభాస్ ఫ్యాన్స్ హల్చల్


పేరు ఇప్పుడు దేశం అంతా వినిపిస్తోంది. కేజీయఫ్ సినిమాతో ఒక్కసారిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశాంత్ నీల్ హాట్ టాపిక్ అయ్యారు. కన్నడ పరిశ్రమ ఖ్యాతిని పెంచిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు వరుసబెట్టి ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టేశారు. ప్రశాంత్ నీల్ ఫోకస్ మొత్తం కూడా టాలీవుడ్ హీరోల మీదే ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తున్నారు.. ఆ తరువాత ఎన్టీఆర్‌తొ ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు. అలా ప్రశాంత్ నీల్ ఇప్పుడు టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హాట్ ఫేవరేట్ డైరెక్టర్ అయ్యారు. మరీ ముఖ్యంగా , యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఆయన్ను నెత్తిన పెట్టేసుకుంటున్నారు. ఇక నేడు ఆ దర్శకుడి బర్త్ డే సందర్బంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. బర్త్ డే ఆయనది అయినా కూడా ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాల పేర్లతో ట్విట్టర్ హోరెత్తిపోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 31వ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ చేతిలో ఉందన్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్‌తో సలార్ సినిమా ఆల్రెడీ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు చిత్రాలు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాయి. HBD Prasanth Neel అని చెబుతూనే సలార్, అనే హ్యాష్ ట్యాగ్‌లు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ప్రశాంత్ నీల్ మీద తెలుగు సినీ ప్రేక్షకులు చూపిస్తోన్న ప్రేమకు నిదర్శనమిదే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే నేడు ఏదైనా ఒక అప్డేట్ ఉండొచ్చని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.


By June 04, 2021 at 09:39AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/jr-ntr-and-prabhas-fans-wishes-prashanth-neel-on-birthday/articleshow/83224917.cms

No comments