Breaking News

G7 Summit: దేశంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛపై మోదీ కీలక వ్యాఖ్యలు


బ్రిటన్ వేదికగా జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా రెండో రోజు పాల్గొన్నారు. శనివారం నాటి సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ఒకే భూమి, ఒకే ఆరోగ్యం నినాదాన్ని వినిపించారు. భ‌విష్య‌త్తులో ఇలాంటి మ‌హ‌మ్మారుల‌ను నివారించ‌డానికి ప్ర‌జాస్వామిక‌, పార‌ద‌ర్శ‌క స‌మాజాలు ప్ర‌త్యేక బాధ్య‌త‌ను తీసుకోవాల‌ని మోదీ స్ప‌ష్టం చేశారు. ఆ దిశ‌గా అంత‌ర్జాతీయ ఐక్య‌త‌, నాయ‌క‌త్వం, సంఘీభావం ఉండాల‌ని కోరారు. క‌రోనా రెండో దశ విజృంభణ స‌మ‌యంలో భార‌త్‌కు అండ‌గా నిలిచిన జీ7 స‌భ్య దేశాల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అంత‌ర్జాతీయ ఆరోగ్య పాల‌న‌ను మెరుగుప‌రిచేందుకు భార‌త్ పూర్తి మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని మోదీ తెలిపారు. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి తిరిగి పూర్వ ద‌శ‌కు చేరుకోవ‌డం, భ‌విష్య‌త్ మ‌హమ్మారుల‌ను నివారించే ల‌క్ష్యంతో ‘బిల్డింగ్ బ్యాక్ స్ట్రాంగర్‌-హెల్త్’ అనే టైటిల్‌తో మోదీ ప్ర‌సంగం సాగింది. క‌రోనాను ఎదుర్కోవ‌డంలో భాగంగా ఇండియా విజ‌య‌వంతంగా ఉప‌యోగించిన డిజిట‌ల్ సాధనాల గురించి కూడా మోదీ వివ‌రించిన‌ట్లు పీఎంవో ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. క‌రోనా వ్యాక్సిన్ల‌పై పేటెంట్‌ను ఎత్తేయ‌డానికి మ‌ద్ద‌తివ్వాల‌ని కూడా మోదీ కోరారు. ఆదివారం రెండు సెష‌న్ల‌లో మాట్లాడిన మోదీ... ఆరోగ్యం, వాతావరణ మార్పు, ఆర్థిక పునరుద్ధరణ వంటి సవాళ్లను పరిష్కరించడానికి ప్రపంచం కలిసికట్టుగా ఉండాలి సూచించారు. ‘బిల్డింగ్ బ్యాక్ టుగెదర్ - ఓపెన్ సొసైటీస్ అండ్ ఎకానమీ’ నినాదాన్ని మోదీ ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ భారత నాగరికత నైతికతలో ఒక భాగమని మోదీ గుర్తు చేశారు. సైబర్‌స్పేస్ ప్రజాస్వామ్య విలువలను అభివృద్ధి చేయడానికి మార్గంలా చూడాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారుని పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు భావప్రకటన స్వేచ్ఛను హరించేవిగా ఉన్నాయన్న ఆరోపణలు నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వాతావరణ మార్పులపై మాట్లాడుతూ.. భూ గ్రహంపై వాతావరణం, జీవవైవిధ్యం, మహాసముద్రాలను ఒక్కరిగా రక్షించలేమని ఎత్తిచూపారు. వాతావరణ మార్పులపై సమిష్టి చర్య తీసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.


By June 14, 2021 at 09:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cyberspace-must-foster-not-curb-democratic-values-pm-modi-speaking-at-g7-summit/articleshow/83500791.cms

No comments