Breaking News

Delta Variantమరో కొత్త వేరియంట్ ‘లాంబ్డా’.. 29 దేశాలకు వ్యాప్తి: యూకే ప్రకటనతో కలవరం


కరోనా వైరస్‌లో జన్యుమార్పిడులు ప్రపంచాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే డెల్టా, డెల్లా ప్లస్ వేరియంట్‌ భయాలు ఓవైపు వెంటాడుతుండగా.. తాజాగా ‘లాంబ్డా’ అనే మరో వేరియంట్‌‌ బయటపడింది. ఈ వేరియంట్‌ను తమ దేశంలో గుర్తించినట్టు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ) తెలిపింది. గత వారం యూకేలో నమోదయిన మొత్తం కోవిడ్ కేసుల్లో 42 శాతం డెల్టా ప్లస్ కాగా.. ‘లాంబ్డా’ వేరియంట్‌కు చెందిన 6 కేసులు కనుగొన్నట్టు పీహెచ్ఈ పేర్కొంది. వీటిలో ఐదు కేసులు విదేశీ ప్రయాణాలతో ముడిపడినట్టు పేర్కొంది. కొత్త వేరియంట్‌ వెలుగు చూడటంతో దాని ప్రభావంపై పరిశోధన కొనసాగుతోందని పీహెచ్ఈ తెలిపింది. అయితే, పూర్తిస్థాయి రెండు డోస్‌ల వ్యాక్సిన్ కారణంగా ఆసుపత్రిలో చేరే అవకాశం ఉండదనే అభిప్రాయాన్ని పీహెచ్‌ఈ వ్యక్తం చేసింది. దీనిపై ఇతమిత్థంగా ఒక అభిప్రాయానికి రావడానికి ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయని తెలిపింది. లాంబ్డా వేరియంట్‌‌తో మరింత ఎక్కువ ప్రమాదం ఉందా? వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లపై తక్కువ ప్రభావం చూపుతుందా? అనడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. గ్రీక్ ఆల్ఫాబెట్ లెటర్స్ ఆధారంగా కొత్త వేరియంట్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్లును సూచిస్తోంది. లాంబ్డా వేరియంట్‌ను తొలిసారి గతేడాది ఆగస్టులో పెరులో గుర్తించారని డబ్ల్యూహెచ్ఓ ఓ వీక్లీ బులిటెన్‌లో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 29 దేశాల్లో కనిపించిందని, ముఖ్యంగా అర్జెంటీనా, చిలీ సహా లాటిన్ అమెరికాలో ఈ వేరియంట్ కేసులు ఉన్నాయని వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పెరూలో నమోదయిన మొత్తం కరోనా కేసుల్లో 81 శాతం లాంబ్డా వేరియంట్‌కు చెందినవి.. చిలీలో గత రెండు నెలల్లో నమోదయిన కేసుల్లో 32 కేసుల్లో లాంబ్లా వేరియంట్ గుర్తించామని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇక, యూకేలో ఇప్పటి వరకూ 35,204 కేసులు నమోదయ్యాయి. గతవారంతో పోల్చితే ఈ వేరియంట్ కేసులు 46 శాతం మేర పెరిగినట్టు పేర్కొంది.


By June 28, 2021 at 08:00AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/uk-report-says-another-new-variant-lambda-and-under-probe/articleshow/83909433.cms

No comments