Breaking News

భార్య వేధించినా.. అవకాశం లేదు, అదే దురదృష్టం.. మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు


భార్యలకి మాత్రమే గృహ హింస కేసు పెట్టేందుకు అవకాశముంది.. భార్య వేధింపులకు గురైన భర్తలకు దురదృష్టవశాత్తూ అలాంటి చట్టాలు లేవంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. రాబోయే సరిగ్గా నాలుగు రోజుల ముందు భర్తపై ఫిర్యాదు చేసి ఉన్న ఉద్యోగం కూడా ఊడగొట్టిన భార్య కేసును విచారించిన న్యాయస్థానం షాకింగ్ కామెంట్స్ చేసింది. విడాకులు వస్తాయని తెలిసి కావాలనే ఉద్యోగం నుంచి తీసేయాలని ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు భావించిన న్యాయస్థానం అతన్ని విధుల్లోకి తీసుకోవాల్సిందిగా తీర్పునివ్వడం విశేషం. సేలం జిల్లాకు చెందిన శశికుమార్ వెటర్నరీ వైద్యులు. కుటుంబ కలహాల కారణంగా ఆయన భార్య 2015లో గృహ హింస కేసు పెట్టింది. కేసు విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు ఇచ్చేందుకు నిర్ణయించింది. అయితే మరో నాలుగు రోజుల్లో విడాకులు రానున్న సమయంలో తన భర్తపై క్రిమినల్ కేసులు ఉన్నందున విధుల నుంచి తొలగించాలంటూ ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. తనను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడంపై శశికుమార్ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్యే తనను చిత్ర హింసలు పెట్టేదని.. తనను వదిలేసి వెళ్లిపోయిందని వాదించారు. శశికుమార్ కేసు విచారించిన న్యాయస్థానం పిటిషనర్ భార్య కావాలనే వేధించినట్లుగా అర్థమవుతోందని.. విడాకులు మంజూరవుతాయని తెలిసినా కావాలనే ఫిర్యాదు చేసినట్లు కోర్టు అభిప్రాయపడింది. ఆయనను 15 రోజుల్లోగా విధుల్లోకి తీసుకోవాలని చెప్పింది. తీర్పు సందర్భంగా న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దంపతులు తమ అహాన్ని కాలి చెప్పుల్లా చూడాలని.. ఇంటి బయటే ఈగోని వదిలేసి రావాలని సూచించింది. లేకుంటే ఆ ఫలితాన్ని పిల్లలు అనుభవించాల్సి వస్తుందని విచారం వ్యక్తం చేసింది. జీవితంలో పెళ్లి అనేది పవిత్రమైన కార్యమని అభిప్రాయపడిన న్యాయస్థానం.. గృహ హింస చట్టం 2005 అమల్లోకి వచ్చినప్పటి నుంచి పవిత్రత అనే పదానికి అర్థం లేకుండా పోయిందన్నారు. సహజీవనానికి అవకాశం ఉండడమే అందుకు కారణమని పరోక్షంగా వ్యాఖ్యానించింది. Also Read:


By June 02, 2021 at 03:53PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/no-law-for-husbands-to-protect-from-wives-in-domestic-violence-madras-hc/articleshow/83171526.cms

No comments