ఆన్‌లైన్ క్లాసులో సడెన్‌గా పోర్న్ వీడియో ప్రత్యక్షం.. విద్యార్థులు షాక్!
కారణంగా విద్యా సంస్థలు మూతబడటంతో పాఠాలు ఆన్‌లైన్‌లోనే బోధిస్తున్నారు. తాజాగా, ఆన్‌లైన్ తరగతుల్లో అపశ్రుతి దొర్లింది. ఓ కాలేజీ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ క్లాసులో ఒక్కసారిగా అశ్లీల వీడియో దర్శనమిచ్చింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఖంగుతిన్నారు. ఈ ఘటన ముంబై నగరం విల్లాపార్లేలోని ఓ కాలేజీ ఆన్‌లైన్ తరగతిలో చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆశ్లీల వీడియోను ప్రదర్శించినట్టు కాలేజీ ప్రొఫెసర్ జుహు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఐపీసీ, ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్ తరగతిలో అశ్లీల వీడియోను ప్రదర్శించిన వారెవరనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేస్తామని ముంబై పోలీసులు చెప్పారు. ఈ ఘటన నాలుగు రోజుల కిందట జరిగినట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. కాలేజీ ప్రొఫెసర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేశామన్నారు. సైబర్ విభాగం పోలీసులు కూడా ఈ అంశంపై దృష్టిసారించారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆన్‌లైన్ క్లాసుల్లో పోర్న్ వీడియోలు దర్శనమివ్వడం ఇదే తొలిసారి కాదు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇటువంటి ఘటనలు వెలుగుచూశాయి. అలాగే, ఉపాధ్యాయులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది నుంచి దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలూ ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. కొన్ని చోట్ల పాఠశాలలను తెరిచినా కరోనా విజృంభించడంతో మూసివేసి ఆన్‌లైన్‌లో బోధన కొనసాగిస్తున్నారు. పిల్లలకు టీకా అందుబాటులోకి రాకపోవడంతో ప్రయోగాలు కొనసాగుతున్నాయి.
By June 28, 2021 at 11:05AM
No comments