Breaking News

రుతుపవనాలపై భిన్నమైన ప్రకటనలు.. కేరళను తాకినట్టా? లేనట్టా?


నైరుతి రుతుపవనాలు సోమవారం కేరళ తీరాన్ని తాకుతాయని ఆదివారం ఉదయం భారత వాతావరణ విభాగం () ప్రకటించింది. అయితే, అదే రోజు మధ్యాహ్నం మళ్లీ ఓ ఆకస్మిక ప్రకటన విడుదల చేసింది. రుతుపవనాలు ఆగమన కాస్త జాప్యం చోటుచేసుకుందని, జూన్ 3న కేరళకు చేరుకుంటాయని పేర్కొంది. అయితే ఈ ప్రకటనలకు భిన్నంగా ప్రైవేట్‌ వాతావరణ అధ్యయన సంస్థ స్కైమెట్‌ మాత్రం... నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళలో ప్రవేశించాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఏటా జూన్‌ తొలివారంలో దేశంలోకి ప్రవేశిస్తాయి. నైరుతి రుతుప‌వ‌నాలు కేర‌ళ తీరానికి చాలా దగ్గర‌గా వ‌చ్చినట్టు ఐఎండీ తెలిపింది. ముందుగా జూన్ 1కి రుతుప‌వ‌నాలు కేర‌ళకు వ‌స్తాయ‌ని అంచ‌నా వేశారు. మంద‌గ‌మ‌నం కార‌ణంగా మ‌రో రెండు రోజులు ఆల‌స్యమవుతుందని ఐఎండీ వివరించింది. అయితే, మే 30నే కేరళలో రుతుపవనాలు ప్రవేశించినట్టు ప్రకటించింది. మే 30కి రెండు రోజులు అటు ఇటుగా ప్రవేశిస్తాయని చెప్పామని, వరుసగా రెండో ఏడాది తాము అంచనా వేసినట్టే కేరళను తాకాయని పేర్కొంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. రుతుపవనాల రాకకు సూచికగా వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటారు. ‘అవసరమైన అన్ని పరిమితులు సంతృప్తిపకరంగా ఉన్నాయి.. ముఖ్యంగా ఆగ్నేయ అరేబియా సముద్రం, పక్కనే ఉన్న ఈక్విటోరియల్ హిందూ మహాసముద్రం మీదుగా వర్షపాతం, గాలుల వేగం’ ఆధారంగా రుతుపవనాలు ప్రవేశించినట్టు అధికారిక వెబ్‌సైట్‌లో స్కైమెట్ ధ్రువీకరించింది. వాతావరణం అనుకూలంగా లేకపోతే రుతుపవనాల్లో కాస్త మందగమనం ఉంటుంది. దక్షిణ ద్వీపకల్పం, తూర్పుమధ్య బంగాళాఖాతంలోని ప్రాంతాలకు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈశాన్య భారత్‌లోకి సకాలంలో చేరుకుంటాయని, జూన్ మొదటి వారంలో తీర ప్రాంతానికి ఇరువైపులా తుఫానులు ఏర్పడటం రుతుపవనాల వేగం పెంచి, బలోపేతం చేసింది. ఉత్తర అండమాన్ సముద్రంలోని పోర్ట్ బ్లయిర్, కార్ నికోబార్, నాకౌరై, హుట్‌బే, మయాబండేర్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని స్కైమెట్ తెలిపింది. అలాగే, కేరళ, కర్ణాటక తీరం, లక్షద్వీప్‌లలో చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.


By June 01, 2021 at 08:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/imd-and-skymet-differ-on-southwest-monsoon-2021-arrival-in-kerala-coast/articleshow/83134924.cms

No comments